chiranjeevi: జమ్కు జమా.. లస్కు టపా.. అంటే అర్థం ఇది..!
‘ఠ్ఠ్ దెబ్బకాయ్..’, ‘జమ్కు జమా.. లస్కు టపా’, ‘మీ బాక్సులు బద్దలైపోతాయి’, ‘ఏది మీ ఫేస్ కాస్త టర్నింగ్ ఇచ్చుకోండి’
‘ఠ్ఠ్ దెబ్బకాయ్..’, ‘జమ్కు జమా.. లస్కు టపా’, ‘మీ బాక్సులు బద్దలైపోతాయి’, ‘ఏది మీ ఫేస్ కాస్త టర్నింగ్ ఇచ్చుకోండి’, ‘చిన్న డెకరేషన్ ఇచ్చా’, ‘రఫ్ఫాడించేస్తా’, ఇలా సినిమాకొక మేనరిజమ్‌తో అభిమానులను అలరించిన అగ్ర కథానాయకుడు చిరంజీవి. ఒక హీరో నోటి నుంచి అదీ చిరంజీవిలాంటి మాస్ హీరో నోటి నుంచి వచ్చే చిన్న చిన్న డైలాగ్‌లకు అభిమానుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. ఆ పదాలు మనం నిత్యం మాట్లాడే మాటల్లో అంతర్భాగమైపోతుంటాయి.
‘చిరు’ చూపిన ఒక్కో మేనరిజం వెనుక ఒక్కో కథ ఉంది. ‘కొండవీటి రాజా’లో కథానాయకుడికి ఏదైనా మేనరిజం పెట్టాలని ‘ఠ్ఠ్ దెబ్బకాయ్..’ అని చిరుని చెప్పమన్నారట దర్శకుడు రాఘవేంద్రరావు. అయితే, నాలుకతో ‘ఠ్ఠ్’ అనే శబ్దాన్ని చిరు గట్టిగా పలకలేకపోయారు. ఓ సందర్భంలో నిర్మాత కేఎస్ రామారావు ఆ శబ్దాన్ని చాలా గట్టిగా అనడం విన్న చిరు డబ్బింగ్ సమయంలో ఆయనను పిలిచి, ‘‘దెబ్బకాయ్’ అని నేను అంటాను. మీరు ఆ సౌండ్ చేయండి’’ అన్నారట. సినిమాలో మనకు వినిపించే ఆ శబ్దం కేఎస్ రామారావు నోటి నుంచి వచ్చిందే!
ఇక విజయశాంతితో కలిసి చిరు నటించిన ఓ చిత్రంలో ఆమె అందాన్ని పొగుడుతూ ‘జమ్కు జమ.. లస్కు టపా’ అంటారు. ‘ఆ పదం అర్థం ఏంటి?’ అని విజయశాంతి.. చిరుని అడిగారట. ‘అబ్బో చాలా ఉంది. నువ్వు నన్ను అడగకూడదు. రాఘవేంద్రరావుగారిని వెళ్లి అడుగు చెబుతారు’ అన్నారట. వెళ్లి రాఘవేంద్రరావును అడిగితే ‘నీ అంద చందాలకు దాసుడనైపోయాను’ అని అర్థం అని చెప్పారట. దాంతో విజయశాంతి చిరు వద్దకు వెళ్లి ‘ఆ పదానికి అర్థం ఇదట’ అని చెప్పారు. వెంటనే చిరు వెళ్లి రాఘవేంద్రరావును ‘ఆ అర్థం నిజమేనా?’ అడిగితే ఆయన నవ్వుతూ ‘కాదు.. నిన్ను ఎలా పడేస్తానో చూడు’ అని చెప్పారట. దీంతో వారిద్దరూ పడి పడి నవ్వుకున్నారట.
‘ఘరానా మొగుడు’ చిత్రంలో చిరు ప్రదర్శించిన మేనరిజమ్ ఎవర్‌గ్రీన్. ఒక చేత్తో నమస్కారం చేయడం, ‘ఫేస్ కాస్త లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకోండి’ వంటివి బాగా పాపులర్ అయ్యాయి. ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ షూటింగ్ బొర్రా గుహల్లో జరుగుతుండగా పర్యాటకులెవర్నీ లోపలికి అనుమతించలేదట. ఆ సమయంలో గుహ బయట నుంచే చిరును చూసి ఓ అభిమాని ‘బాసూ..’ అని పిలిచాడట. చిరు కుడివైపు తిరిగి చూస్తుంటే.. ‘లెఫ్ట్.. లెఫ్ట్ టర్నింగ్ ఇచ్చుకో బాసూ’ అని అరిచాడట. చిరు కూడా హాయ్ చెప్పారట. ఆ వ్యక్తి అన్న మాటను ‘ఘరానా మొగుడు’లో చిరు మేనరిజంగా పెట్టారు పరుచూరి బ్రదర్స్. ఇక నిర్మాత నరసింహారావు చిరంజీవి ఎక్కడ కనపడినా ఒక చేత్తో నమస్కారం పెట్టేవారట. దాన్ని కూడా ఈ సినిమాలో ఉపయోగించుకున్నారు. ఆ తర్వాత అది ఎంత బాగా పాపులర్ అయిందో తెలిసిందే.
అలాగే ‘బాక్సు బద్దలైపోతుంది’ అన్న మాటను కూడా చిరంజీవికి ఉన్న సహాయకుల్లో ఒక వ్యక్తి అనేవారట. ‘సినిమా ఎలా ఉంది’ అని అడిగితే ‘బాక్సు బద్దలైపోయింది బాసూ’ అనేవాడట. అలా కొందరు పలికిన చిరు పదాలను మెగాస్టార్ తన స్టైల్ చెప్పి వాటికి విపరీతమైన క్రేజ్ తీసుకొచ్చారు. అవన్నీ అభిమానులను విశేషంగా అలరించాయి.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
TSPSC: రవికిషోర్ బ్యాంకు లావాదేవీల్లో.. ఏఈ పరీక్ష టాపర్ల వివరాలు
-
Movies News
Social look: ఐఫాలో తారల మెరుపులు.. పెళ్లి సంబరంలో కీర్తి హోయలు
-
India News
Shashi Tharoor: ‘ప్రస్తుత విలువలకు చిహ్నంగా అంగీకరించాలి’.. సెంగోల్‌పై కాంగ్రెస్ ఎంపీ ట్వీట్
-
Movies News
Hanuman: ‘ఆది పురుష్’ ప్రభావం ‘హనుమాన్’పై ఉండదు: ప్రశాంత్ వర్మ
-
Politics News
Nara Lokesh: పోరాటం పసుపు సైన్యం బ్లడ్‌లో ఉంది: లోకేశ్
-
Sports News
IPL Final: అహ్మదాబాద్‌లో వర్షం.. మ్యాచ్ నిర్వహణపై రూల్స్ ఏం చెబుతున్నాయి?