కీరవాణి పోలీస్ గెటప్ వెనుక కథ!
సంగీత దర్శకుడిగా తన పాటలతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన వ్యక్తి ఎం.ఎం.కీరవాణి. మెలోడి, ఫాస్ట్‌బీట్, భక్తి ఇలా పాట
ఇంటర్నెట్‌డెస్క్: సంగీత దర్శకుడిగా తన పాటలతో శ్రోతలను మంత్రముగ్ధులను చేసిన వ్యక్తి ఎం.ఎం.కీరవాణి. మెలోడి, ఫాస్ట్‌బీట్, భక్తి ఇలా పాట ఏదైనా కీరవాణి నుంచి వచ్చిందంటే అది కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుంది. ఇక రాఘవేంద్రరావు కాంబినేషన్లో వచ్చిన సినిమాల్లోని పాటలు ప్రత్యేకమనే చెప్పాలి. సంగీత దర్శకుడిగా తనదైన ముద్రవేసిన కీరవాణికి నటించే అవకాశం కూడా వచ్చింది. కానీ, పనిభారం వల్ల ఆ పాత్రను చేయలేకపోయారు! ఎందుకు ఆ పాత్రను చేయలేకపోయారో ఓ సందర్భంలో ఇలా చెప్పుకొచ్చారు స్వరమణి కీరవాణి.
‘‘నా భార్యకు పోలీస్‌శాఖలో ఉద్యోగం చేసే వారంటే ఇష్టం, గౌరవం. కానీ, తానొకటి తలిస్తే దైవం ఒకటి తలుస్తుంది అంటారు కదా! అలా సంగీత దర్శకుడు ఆమెకు భర్తగా దొరికాడు. ఒక రోజు మాటల సందర్భంలో ‘పోలీస్ ఆఫీసర్‌ను పెళ్లి చేసుకోవాలని అనుకున్నా’ అని నాతో చెప్పింది. ఆమెకు ఆ కోరిక నెరవేరలేదు కాబట్టి, కనీసం నేను పోలీస్ ఆఫీసర్ గెటప్ వేసుకుని తన ముఖంలో సంతోషం చూద్దామని అనుకున్నా. వెంటనే ఆర్కే ఫిల్స్మ్ అసోసియేషన్‌లో మల్లికార్జున్‌రావు అనే మేకప్‌మ్యాన్‌కు చెబితే, ఆయన పోలీస్ డ్రెస్ కుట్టి ఇచ్చారు. అంతేకాదు, మేకప్ కూడా వేశారు. ఆ గెటప్‌లో వెళ్లి నా భార్యను సర్ప్రైజ్ చేయాలనుకున్నా’’
‘‘సర్లే ఎలాగూ డ్రెస్ వేసుకున్నాం కదాని! అక్కడే వేరే గదిలో రాఘవేంద్రరావు గారు ఉంటే, ఆయనకు కూడా షాకిద్దామని ఆ గెటప్‌లో లోపలికి వెళ్లాను. దీంతో ఆ గెటప్ ఆయనకు బాగా నచ్చి ఫొటోలు తీశారు. ‘ఏదైనా పోలీస్ ఆఫీసర్ వేషం ఉంటే ఇవ్వండి’ అని రాఘవేంద్రరావుగారిని అడిగాను. అప్పుడే ‘ఘరానా బుల్లోడు’ చిత్ర కథను చెప్పి, అందులో ఇన్స్పెక్టర్ వేషం కూడా ఇచ్చారు. కానీ, రికార్డింగ్‌లో బాగా బిజీగా ఉండటంతో ఆ పాత్ర చేయలేకపోయా. ఆ వేషం వేసుకుని ఇంటికి వెళ్లి నా భార్యను సర్ప్రైజ్ చేశా’’ అంటూ తాను పోలీస్ గెటప్ వేసుకోవడం వెనుక ఉన్న కథను పంచుకున్నారు.
ఈ సినిమాకు సంగీతం అందించింది కీరవాణినే. నాగార్జున, రమ్యకృష్ణ ,ఆమని జంటగా తెరకెక్కిన ఈ చిత్రం మంచి విజయం అందుకుంది.అంతేకాదు, ‘సీతయ్య’లో పోలీస్ ఆఫీసర్‌గా నటించిన హరికృష్ణకు కొంచెం డబ్బింగ్ కూడా చెప్పారు. ‘ఒక్క మగాడు’ అంటూ సాగే పాటలో ముందు వచ్చే పదాలు ఎం.ఎం.కీరవాణి స్వరం నుంచే వచ్చాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Venky: 20 ఏళ్ల ‘వెంకీ’.. ఈ హిట్ మూవీ మిస్సైన హీరోయిన్ ఎవరంటే?
రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘వెంకీ’ చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Brindha Sivakumar: మణిరత్నం ‘హీరోయిన్ ఛాన్స్’ వదులుకున్న బృందా.. సూర్య సోదరి గురించి మీకు తెలుసా?
ప్రముఖ హీరోలు సూర్య, కార్తి సోదరి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
gautham Menon:ఆ కీలక పాత్రలకు వారిని అనుకున్నా: గౌతమ్‌మేనన్
సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
Prithviraj Sukumaran: రెండు ఆఫర్లు ఇచ్చిన చిరంజీవి.. తిరస్కరించిన పృథ్వీరాజ్ సుకుమారన్.. కారణమదే
చిరంజీవి ఇచ్చిన రెండు ఆఫర్లను ఓ సినిమా కారణంగా తిరస్కరించాల్సి వచ్చిందని మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. -
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్‌లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు నటించిన ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. -
Mohan Babu: మోహన్‌బాబు అలా ‘అల్లుడుగారు’ అయ్యారు.. అదరగొట్టారు
నేడు మోహన్‌బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘అల్లుడుగారు’ సినిమా సంగతులు చూద్దాం.. -
Deepika Padukone: అలా మిస్సై.. ‘కల్కి 2898ఏడీ’తో సిద్ధమై: దీపికా టాలీవుడ్ ఎంట్రీ సంగతులివీ..
ప్రముఖ నటి దీపికా పదుకొణె టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Daddy Movie: చిరంజీవి ‘డాడీ’ మూవీ వెంకటేశ్ చేస్తే సూపర్ హిట్ అయ్యేదట!
Daddy movie: ‘డాడీ’ మూవీ యావరేజ్‌గా ఆడటంపై చిరంజీవి ఓ సందర్భంలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. -
Prema: షూటింగ్లో నిజంగానే పాము కాటేసింది.. ఆ హిట్ సినిమాకు 25 ఏళ్లు..
నటి ప్రేమ (Prema) ప్రధానపాత్రలో నటించిన ‘దేవి’ (Devi) చిత్రం విడుదలై నేటికి 25ఏళ్లు పూర్తయింది. -
Sekhar Kammula: ఆ ఫీల్‌గుడ్ స్టోరీ.. పవన్‌ను దృష్టిలో పెట్టుకుని రాసిందే కానీ..!
ఓ హిట్ సినిమా స్టోరీని ప్రముఖ హీరో పవన్ కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారు ఆ దర్శకుడు. ఆ ఆసక్తికర సంగతులివీ.. -
చిరు-నాగ్-వెంకటేశ్‌లతో మల్టీస్టారర్ తీయాలనుకున్నారు
ఒక టికెట్టుపై డబుల్ ధమాకా వినోదాల్ని పంచిచ్చేవి మల్టీస్టారర్ చిత్రాలు. అందుకే ఏ చిత్రసీమలోనైనా ఓ మల్టీస్టారర్ చిత్రం మొదలవుతుందంటే.. ప్రేక్షకుల చూపంతా అటువైపే మళ్లుతుంటుంది. -
Sharwanand: అందుకే శర్వానంద్ ఆ హిట్ మూవీకి ‘నో’ చెప్పారు.. సెకండ్ ఛాన్స్‌లోనూ!
హీరో శర్వానంద్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయం మీకోసం.. -
Mahesh Babu: మహేశ్ బాబును అనుకున్నారు.. తరుణ్‌తో తెరకెక్కించారు!
తరుణ్ నటించిన ఓ హిట్ చిత్రంలో.. ముందుగా మహేశ్ బాబును హీరోగా అనుకున్నారు నిర్మాత. కానీ, డైరెక్టర్ వద్దనుకున్నారు. అదే సినిమా అంటే? -
Soggadu Movie: రవిబాబు మూవీకి నో చెప్పిన ఉదయ్‌కిరణ్.. కోపంతో నిర్ణయం తీసుకోవడం వల్లే..!
Soggadu Movie: ‘సోగ్గాడు’కి క్యాస్ట్ ఫెయిల్యూర్ కారణంగా మూవీపై ఎలాంటి ప్రభావం పడిందో రవిబాబు ఓ సందర్భంలో చెప్పారు. -
ఈ హీరోలు ఇలా చెబితే డేట్స్ ఇస్తారట!
అసలు ఎవరికి ఏం చెబితే కాల్షీట్స్ ఇస్తారో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ సందర్భంలో ఇలా చెప్పారు. -
Samantha: రామలక్ష్మిపై అందరూ అనుమానం వ్యక్తంచేశారు!
Samantha: కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన సమంత 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆమె ‘ఏమాయ చేసావె’తో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. -
baahubali: ‘బాహుబలి’లో ఆ పాత్రను ఆయన ఎందుకు చేయలేదంటే?
‘బాహుబలి’ సినిమాలోని కట్టప్ప పాత్ర సంజయ్‌దత్‌ను ఊహించి రాసిందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు. -
Mahesh babu: ‘మురారి’ శాపం వెనుక స్టోరీ ఇది.. క్లైమాక్స్‌లో ఆ పాట వద్దన్న కృష్ణ..!
మహేశ్‌బాబు కథానాయకుడిగా కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ చిత్రం ‘మురారి’. సోనాలి బింద్రే కథానాయిక. 2001 ఫిబ్రవరి 17న విడుదలైన ఈ సినిమా 23 ఏళ్లు పూర్తి చేసుకుంది. -
Jayamalini: జయమాలిని కోసం కత్తితో బెదిరింపు!
సినీ తారలను చూసేందుకు జనం విరగబడి రావడం, వారితో సెల్ఫీల కోసం పోటీ పడటం మనం చూస్తుంటాం. సరిగ్గా ఇలాంటి పరిస్థితే అలనాటి నృత్యతార జయమాలినికి (Jayamalini) ఎదురైందట. -
Temper: ఆర్. నారాయణమూర్తి ‘టెంపర్’లో నటించకపోవడానికి కారణమిదే
ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన ‘టెంపర్’ తొమ్మిదేళ్లు పూర్తిచేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి ఆసక్తికర అంశం మీకోసం.. -
Oy: ‘ఓయ్’ టైటిల్ అర్థమిదే.. మీరు గమనించారా?
సిద్ధార్థ్, షామిలీ జంటగా నటించిన చిత్రం ‘ఓయ్!’. ఈ సినిమాకి ఆ పేరెందుకు పెట్టారో మీకు తెలుసా?
తాజా వార్తలు (Latest News)
-
భారత సంతతి డాక్టర్‌కు ₹2 కోట్ల కోర్టు ఫీజు.. సాయానికి ముందుకొచ్చిన మస్క్
-
భారత్ ప్రమేయాన్ని కొట్టిపారేయలేం.. నిజ్జర్ హత్యపై ట్రూడో మళ్లీ అదే పాట..!
-
మా బౌలర్ల తప్పేమీ లేదు.. హైదరాబాద్ బ్యాటర్లకు హ్యాట్సాఫ్: హార్దిక్ పాండ్య
-
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్‌రాజు
-
కొనసాగుతున్న మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక
-
‘అత్యంత సంతోషకరమైన వ్యక్తి ఆమె’.. నెట్టింట వైరల్‌గా మారిన కావ్యా మారన్