K Viswanath: కె.విశ్వనాథ్ ఖాకీ దుస్తుల వెనుక కథ ఇది!
ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి, ఆహార్యం ఉంటాయి. లెజెండరీ దర్శకుడు కె.విశ్వనాథ్ మెగాఫోన్ పడితే ఒంటిపై ఖాకీ దుస్తులు ఉండాల్సిందే. దీని గురించి ఓ సందర్భంగా కె.విశ్వనాథ్ స్వయంగా పంచుకున్నారు.
ఇంటర్నెట్‌డెస్క్: ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి, ఆహార్యం ఉంటాయి. కోడి రామకృష్ణ తలకు క్లాత్ కట్టుకుంటారు. రాఘవేంద్రరావు దాదాపు గడ్డంతోనే కనిపిస్తారు. షూటింగ్ జరిగినన్ని రోజులు రాజమౌళి కూడా పరిస్థితి కూడా దాదాపు అంతే. లెజెండరీ దర్శకుడు కె.విశ్వనాథ్ మెగాఫోన్ పడితే ఒంటిపై ఖాకీ దుస్తులు ఉండాల్సిందే. దీని గురించి ఓ సందర్భంగా కె.విశ్వనాథ్ స్వయంగా పంచుకున్నారు.
‘‘సెట్లో ఖాకీ యూనిఫామ్ది చాలా పెద్ద కథ. సౌండ్ రికార్డిస్ట్‌గా ఉండి దర్శకుడ్ని అయినవాడ్ని. ఓ రకంగా తలబిరుసు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నవాడ్ని. ఎమ్మెల్యే అయినవాడు మంత్రి అవ్వాలనుకుంటాడు. మంత్రి అయినవాడు ముఖ్యమంత్రి కావాలని కలలు కంటాడు. సినిమాల్లోనూ అంతే. ఏ విభాగంలో అడుగుపెట్టినా.. చిట్టచివరి లక్ష్యం దర్శకుడి కుర్చీనే. అలాంటి కుర్చీ నాకు దక్కితే కళ్లు నెత్తికెక్కే ప్రమాదం ఉంటుంది కదా? ఆ అవకాశం ఇవ్వకూడదనుకున్నా. దర్శకుడ్ని అయిపోగానే తెల్ల ప్యాంటూ, తెల్ల చొక్కా, తెల్ల బూట్లూ, మెళ్లో గొలుసులూ వేసుకుని హడావుడి చేయడం నాకిష్టం లేదు. నేనూ అందరిలానే మామూలు మనిషిలాగానే ఉండాలనుకున్నా. నిజాయతీగా చేసిన ప్రయత్నం. నా సెట్లో పనిచేసే పెయింటర్స్, లైట్‌బాయ్స్, హెల్పర్స్.. అందరికీ ఖాకీ దుస్తులే. కాకపోతే వాళ్లకు నిక్కరు, నాకు ప్యాంటు అంతే తేడా. ‘మీరు ఖాకీ డ్రస్సు వేసుకోవడం ఏమిటండీ..’ అని మా ఆర్ట్ డైరెక్టర్ తెగ గొడవ పడేవాడు. ‘మొదటి సినిమా సరిగా ఆడకపోతే.. వెంటనే టాక్సీ డ్రైవరుగా మారిపోతా. అప్పుడు కుట్టించుకోవడానికి వీలు ఉంటుందో లేదో.. ఓ జత రెడీ ఉన్నట్టుంటుంది’ అని చెప్పా! అది దొంగ మాటే అయినా.. అందులో కొంత నిజం లేకపోలేదు. తొలి సినిమా రోజుల్లో చాలా భయం ఉండేది. నాకు తెలిసిన పాత్రికేయులు ‘మీ సినిమా కోసం రాస్తాం’ అంటుంటే.. ‘మొదటి సినిమాకి ఏం రాయొద్దు. ఎందుకంటే నా సినిమా తుస్సుమంటే మీరేం రాసినా ఉపయోగం ఉండదు. రెండు, మూడు సినిమాలు తీశాక, నాలో ప్రతిభ ఉంది అనిపిస్తే రాయండి’ అనేవాడ్ని’’
118 ఏళ్లు బతకాలనుకోవాలట..
జీవితం అంటే మరేదో కాదు.. జీవించడమే. ఇప్పుడు నా జీవితం గురించి నేను ఆలోచించినా, ఆలోచించకపోయినా.. ఓ భయం మాత్రం ఉంటుంది. అది మరణం గురించే. ఇలాంటి భయాలు ఉండకూడదు అని నాతో చాలా మంది చెప్పారు. ఎవరైనా సరే.. 118 ఏళ్లు బతుకుతాం అనుకోవాలట. 118వ పుట్టిన రోజున ఏం బట్టలు వేసుకోవాలి? ఎవర్ని పిలవాలి? కేక్ ఎలా కట్ చేయాలి? అనే ఆలోచనలతో బతకాలట. 90 ఏళ్లకు వచ్చేశాం.. మొత్తం జీవితం అయిపోయింది అనుకోకూడదట. పిల్లలు సెటిలైపోయారు. వాళ్ల గురించి బెంగ లేదు. ఈ వయసులో బెంగలు విచిత్రంగా ఉంటాయి. ముని మనవడికి ఏమైనా అయితే.. మనసు తట్టుకోలేదు. వాళ్లకు జ్వరం వస్తే ధ్యాసంతా అటే ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అల్లు అర్జున్ సినిమాలో నటించే అవకాశం వచ్చింది.. కానీ: విశాల్
‘రత్నం’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా నటుడు విశాల్ పలు ఆసక్తికర విశేషాలు పంచుకున్నారు. -
ఆయన మీద పీకలదాకా కోపం వచ్చింది!
వైవిధ్యమైన పాత్రల్లో... విలక్షణమైన నటనతో సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసుకున్న ఎస్వీ రంగారావు (S V Ranga Rao) తొలిసారి కెమెరా ముందు ఎలాంటి అనుభవం పొందారనేది ఎంతో ఆసక్తికరం. తన తొలినాటి సినీ అనుభవం గురించి ఎస్వీఆర్ ఓ సందర్భంలో వ్యాసం రాశారు. -
ఆ హిట్ మూవీలో సమంతను వద్దనుకున్న సుకుమార్.. కానీ ఏం జరిగిందంటే!
‘రంగస్థలం’లో మొదట సమంతను వద్దనుకున్నట్లు సుకుమార్ తెలిపారు. ఆ తర్వాత ఆమె నటనకు ఆశ్చర్యపోయినట్లు చెప్పారు. -
నాగబాబుపై ‘చిరు’ కోపం!
అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సోదరుడిగా నాగబాబు పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. అన్నదమ్ములిద్దరూ కలిసి నటించిన సందర్భాలూ ఉన్నాయి. -
Venky: 20 ఏళ్ల ‘వెంకీ’.. ఈ హిట్ మూవీ మిస్సైన హీరోయిన్ ఎవరంటే?
రవితేజ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల తెరకెక్కించిన ‘వెంకీ’ చిత్రం 20 ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈసందర్భంగా ఆ సినిమా గురించి పలు ఆసక్తికర విశేషాలు.. -
Brindha Sivakumar: మణిరత్నం ‘హీరోయిన్ ఛాన్స్’ వదులుకున్న బృందా.. సూర్య సోదరి గురించి మీకు తెలుసా?
ప్రముఖ హీరోలు సూర్య, కార్తి సోదరి గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
gautham Menon:ఆ కీలక పాత్రలకు వారిని అనుకున్నా: గౌతమ్‌మేనన్
సూర్య ప్రధాన పాత్రలో నటించిన ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. -
Prithviraj Sukumaran: రెండు ఆఫర్లు ఇచ్చిన చిరంజీవి.. తిరస్కరించిన పృథ్వీరాజ్ సుకుమారన్.. కారణమదే
చిరంజీవి ఇచ్చిన రెండు ఆఫర్లను ఓ సినిమా కారణంగా తిరస్కరించాల్సి వచ్చిందని మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ తెలిపారు. -
RRR Movie: ‘ఆర్ఆర్ఆర్’ ప్రీక్లైమాక్స్‌లో చేసిన మార్పు ఇదే.. జెన్నీ పాత్ర చనిపోతుందట!
ఎన్టీఆర్, రామ్‌చరణ్‌లు నటించిన ‘ఆర్ఆర్ఆర్’ గురించి ఆ చిత్ర దర్శకుడు రాజమౌళి ఆసక్తికర విషయాన్ని పంచుకున్నారు. -
Mohan Babu: మోహన్‌బాబు అలా ‘అల్లుడుగారు’ అయ్యారు.. అదరగొట్టారు
నేడు మోహన్‌బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా ‘అల్లుడుగారు’ సినిమా సంగతులు చూద్దాం.. -
Deepika Padukone: అలా మిస్సై.. ‘కల్కి 2898ఏడీ’తో సిద్ధమై: దీపికా టాలీవుడ్ ఎంట్రీ సంగతులివీ..
ప్రముఖ నటి దీపికా పదుకొణె టాలీవుడ్ ఎంట్రీ గురించి ఆసక్తికర విశేషాలివీ.. -
Daddy Movie: చిరంజీవి ‘డాడీ’ మూవీ వెంకటేశ్ చేస్తే సూపర్ హిట్ అయ్యేదట!
Daddy movie: ‘డాడీ’ మూవీ యావరేజ్‌గా ఆడటంపై చిరంజీవి ఓ సందర్భంలో ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. -
Prema: షూటింగ్లో నిజంగానే పాము కాటేసింది.. ఆ హిట్ సినిమాకు 25 ఏళ్లు..
నటి ప్రేమ (Prema) ప్రధానపాత్రలో నటించిన ‘దేవి’ (Devi) చిత్రం విడుదలై నేటికి 25ఏళ్లు పూర్తయింది. -
Sekhar Kammula: ఆ ఫీల్‌గుడ్ స్టోరీ.. పవన్‌ను దృష్టిలో పెట్టుకుని రాసిందే కానీ..!
ఓ హిట్ సినిమా స్టోరీని ప్రముఖ హీరో పవన్ కల్యాణ్‌ను దృష్టిలో పెట్టుకుని రాసుకున్నారు ఆ దర్శకుడు. ఆ ఆసక్తికర సంగతులివీ.. -
చిరు-నాగ్-వెంకటేశ్‌లతో మల్టీస్టారర్ తీయాలనుకున్నారు
ఒక టికెట్టుపై డబుల్ ధమాకా వినోదాల్ని పంచిచ్చేవి మల్టీస్టారర్ చిత్రాలు. అందుకే ఏ చిత్రసీమలోనైనా ఓ మల్టీస్టారర్ చిత్రం మొదలవుతుందంటే.. ప్రేక్షకుల చూపంతా అటువైపే మళ్లుతుంటుంది. -
Sharwanand: అందుకే శర్వానంద్ ఆ హిట్ మూవీకి ‘నో’ చెప్పారు.. సెకండ్ ఛాన్స్‌లోనూ!
హీరో శర్వానంద్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ఆయన గురించి ఆసక్తికర విషయం మీకోసం.. -
Mahesh Babu: మహేశ్ బాబును అనుకున్నారు.. తరుణ్‌తో తెరకెక్కించారు!
తరుణ్ నటించిన ఓ హిట్ చిత్రంలో.. ముందుగా మహేశ్ బాబును హీరోగా అనుకున్నారు నిర్మాత. కానీ, డైరెక్టర్ వద్దనుకున్నారు. అదే సినిమా అంటే? -
Soggadu Movie: రవిబాబు మూవీకి నో చెప్పిన ఉదయ్‌కిరణ్.. కోపంతో నిర్ణయం తీసుకోవడం వల్లే..!
Soggadu Movie: ‘సోగ్గాడు’కి క్యాస్ట్ ఫెయిల్యూర్ కారణంగా మూవీపై ఎలాంటి ప్రభావం పడిందో రవిబాబు ఓ సందర్భంలో చెప్పారు. -
ఈ హీరోలు ఇలా చెబితే డేట్స్ ఇస్తారట!
అసలు ఎవరికి ఏం చెబితే కాల్షీట్స్ ఇస్తారో స్టార్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఓ సందర్భంలో ఇలా చెప్పారు. -
Samantha: రామలక్ష్మిపై అందరూ అనుమానం వ్యక్తంచేశారు!
Samantha: కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన సమంత 14 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఆమె ‘ఏమాయ చేసావె’తో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన సంగతి తెలిసిందే. -
baahubali: ‘బాహుబలి’లో ఆ పాత్రను ఆయన ఎందుకు చేయలేదంటే?
‘బాహుబలి’ సినిమాలోని కట్టప్ప పాత్ర సంజయ్‌దత్‌ను ఊహించి రాసిందని విజయేంద్ర ప్రసాద్ అన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
-
‘కేజ్రీవాల్ హత్యకు కుట్ర’.. ఆప్ తీవ్ర ఆరోపణలు
-
దక్షిణాదిలో ఈసారి భాజపా అత్యుత్తమ పనితీరు: అమిత్ షా
-
సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై సస్పెన్షన్ వేటు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
జీహెచ్ఎంసీ పరిధిలో రికార్డు స్థాయిలో విద్యుత్ వినియోగం