‘వైల్డ్‌ డాగ్‌’ వెనకున్న కథ ఇది!

ప్రయోగాత్మక చిత్రాల్లో నటించేందుకు కింగ్‌ నాగార్జున ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో ‘వైల్డ్‌ డాగ్’ చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎన్‌ఐఎ బృందం సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా

Published : 31 Mar 2021 01:11 IST

హైదరాబాద్‌: ప్రయోగాత్మక చిత్రాల్లో నటించేందుకు కింగ్‌ నాగార్జున ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. తాజాగా ఆయన ప్రధాన పాత్రలో ‘వైల్డ్‌ డాగ్’చిత్రం తెరకెక్కిన సంగతి తెలిసిందే. మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్ పతాకంపై నిరంజన్‌రెడ్డి నిర్మించారు. అహిషోర్‌ సాల్మన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ఎన్‌ఐఎ బృందం సీక్రెట్ ఆపరేషన్‌లో భాగంగా ఉగ్రవాదులను ఏరివేసే నేపథ్యంలో సాగుతుంది. ముఖ్యంగా సినిమా చిత్రీకరణ అత్యంత కష్టంతో కూడుకున్నదిగా నాగార్జున చెబుతున్నారు. అయినప్పటికి తన కెరీర్‌లో బాగా ఎంజాయ్‌ చేసిన సినిమా షూట్‌ ఇదేనంటూ చిత్రబృందానికి కితాబిచ్చారు. ‘వైల్డ్‌ డాగ్‌’ వెండితెరపై కనిపించేందుకు చిత్రబృందం ఎంత కష్టపడిందో వివరిస్తూ ఓ వీడియోను ప్రేక్షకులతో పంచుకున్నారు. దియా మీర్జా, సయామీ ఖేర్‌, అలీరెజా, అతుల్‌ కులకర్ణి వంటి నటులు ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటించారు. ఏప్రిల్‌ 2న విడుదలవుతున్న ఈ చిత్రానికి  సంబంధించి తెరవెనుక ఏం జరిగిందో మీరు చూసేయండి!


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని