నాన్న మరణంతో కుంగిపోయా: రాయ్‌ లక్ష్మి

తండ్రి రామ్‌రాయ్‌ మరణంతో తాను మానసికంగా కుంగుబాటుకు లోనయ్యానని నటి రాయ్‌లక్ష్మి అన్నారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న ఆమె తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి స్పందించారు. కరోనా సమయంలో తాను ఎదుర్కొన్న...

Published : 28 Jan 2021 01:29 IST

కరోనా మరింత ఇబ్బందులకు గురి చేసింది: నటి

హైదరాబాద్‌: తండ్రి రామ్‌రాయ్‌ మరణంతో తాను మానసికంగా కుంగుబాటుకు లోనయ్యానని నటి రాయ్‌లక్ష్మి తెలిపారు. ఇటీవల కరోనా నుంచి కోలుకున్న ఆమె తాజాగా తన వ్యక్తిగత జీవితం గురించి వెల్లడించారు. కరోనా సమయంలో తాను ఎదుర్కొన్న పరిస్థితుల గురించి నటి తెలియజేశారు. ‘నా జీవితంలో అది చాలా క్లిష్టమైన పరిస్థితి. నోటి క్యాన్సర్‌ కారణంగా గతేడాది మా నాన్న కన్నుమూశారు. తర్వాత నా జీవితం ఎంతో వెలితిగా అనిపించింది. మానసికంగా కుంగిపోయాను. ఆ పరిస్థితి నుంచి ఎలాగైనా బయటకురావాలని అనుకుంటున్న సమయంలో నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో జరిగే ఓ కార్యక్రమంలో డ్యాన్స్‌ ప్రోగ్రామ్‌ ఆఫర్‌ లభించింది. దాంతో నేను ఎంతో సంతోషంతో దుబాయ్‌కు వెళ్లాను. కొన్ని రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుందనగా నాకు కొవిడ్‌-19 పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.’

‘న్యూఇయర్‌ ఈవెంట్‌ కోసం దుబాయ్‌కు వెళ్లిన తర్వాత బాగా నీరసంగా అనిపించింది. ఆ తర్వాత కొన్ని రోజులుగా గొంతు నొప్పిగా అనిపించడంతో వెంటనే కరోనా పరీక్ష చేయించుకున్నా. అలా పాజిటివ్‌గా నిర్ధారణ అయిన కొన్నిరోజులకే వాసన గ్రహించే లక్షణాన్ని కోల్పోయాను. స్వీయ నిర్బంధంలో ఉండడం ఎంతో కష్టం. దుబాయ్‌లో నాకు అంతగా ఎవరూ తెలీదు. దాంతో నేను ఒక్కదాన్నే ఓ రూమ్‌లో ఐసోలేషన్‌లో ఉన్నా. కరోనా లక్షణాలు నాలో ఎక్కువగా కనిపించనప్పటికీ మానసికంగా నేను మరింత కుంగిపోయాను. ప్రతి నాలుగు రోజులకొకసారి పరీక్షలు చేయించుకున్నా. 12 రోజుల తర్వాత నెగెటివ్‌గా తేలింది.’ అని రాయ్‌లక్ష్మి వెల్లడించారు.

ఇదీ చదవండి

ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపా

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని