‘బెల్‌ బాటమ్‌’ చిత్రీకరణ పూర్తి

అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బెల్‌బాటమ్‌’. కరోనా ప్రభావంతో ఆగిపోయిన ఈ సినిమా చిత్రీకరణ ముందు అనుకున్నట్టుగానే

Published : 02 Oct 2020 14:35 IST

ముంబయి: అక్షయ్‌కుమార్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘బెల్‌బాటమ్‌’. కరోనా ప్రభావంతో ఆగిపోయిన ఈ సినిమా చిత్రీకరణ ముందు అనుకున్నట్టుగానే విదేశాల్లో తిరిగి ప్రారంభమైంది. అంతే వేగంగా చిత్రీకరణ పూర్తయింది. ఈ విషయాన్ని అక్షయ్‌కుమార్‌ ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు.

‘‘చిత్రబృందమంతా కలిసికట్టుగా పనిచేసిన తీరే మా సినిమా పూర్తి కావడానికి ప్రధాన కారణం. చిత్రబృందంలోని అందరికీ ధన్యవాదాలు. రెగ్యులర్‌ చిత్రీకరణ పరిస్థితులకు భిన్నంగా పూర్తి చేశాం’’అన్నారు. రంజిత్‌ ఎమ్‌ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వాణీకపూర్‌ నాయిక. లారా దత్తా, హ్యూమా ఖురేషి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని