కన్న తండ్రే కొడుకు దారికి అడ్డుపడితే..!

కన్నడనాట విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం ‘బెల్‌బాటమ్‌’. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. టాలీవుడ్‌లో డిటెక్టివ్‌ సినిమాలకు మంచి క్రేజ్‌ ఉంది. అందుకే ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’ ఈ కన్నడ సినిమాను తెలుగులో రీమేక్‌ చేసింది.

Updated : 10 Aug 2022 12:40 IST

ఆకట్టుకుంటున్న బెల్‌బాటమ్‌ ట్రైలర్‌

హైదరాబాద్‌: కన్నడనాట విడుదలై మంచి విజయం సాధించిన చిత్రం ‘బెల్‌బాటమ్‌’. ఇప్పుడు తెలుగు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది. టాలీవుడ్‌లో డిటెక్టివ్‌ సినిమాలకు మంచి క్రేజ్‌ ఉంది. అందుకే ప్రముఖ ఓటీటీ వేదిక ‘ఆహా’ ఈ కన్నడ సినిమాను తెలుగులో రీమేక్‌ చేసింది. గతంలో విడుదలైన సినిమా టీజర్‌ అభిమానులను బాగా ఆకట్టుకుంది. తాజాగా.. చిత్ర బృందం ట్రైలర్‌ను సైతం విడుదల చేసింది. అందులో ‘‘ఏది రాసిపెట్టి ఉంటే అదే జరుగుతుందని.. విధికి తలవంచడమే ఉత్తమమని.. ఎదురెళ్లి ఏమీ చేయలేని మనలాంటి నిస్సహాయుల కథే ‘బెల్‌బాటమ్‌’’ అంటూ సినిమా కథను చెప్పకనే చెప్పారు.

‘చిన్న పిల్లాడికి మొలతాడు ఎంత అవసరమో.. మనిషన్నాక ఒక లక్ష్యం కూడా అంతే అవసరం.. ఆ విధంగా మన నాయకుడు లక్ష్యం కోసం పోరాడుతుండగా.. కన్నతండ్రే దారికి అడ్డుపడుతుంటే..’ అంటూ ట్రైలర్‌ మొదలవుతుంది. హేమగిరి పోలీస్‌స్టేషన్‌ లాకర్‌లో ఉన్న సుమారు రూ.8లక్షలు చోరీకి గురవుతాయి. ఎవరికీ అంతుచిక్కని ఆ కేసును ఛేదించే క్రమంలో పోలీసులు హీరో డిటెక్టివ్‌ దివాకర్‌ సాయం కోరతారు. అప్పటికే ఖాళీగా ఉంటూ.. తండ్రి చేతిలో తిట్లు తింటూ ఉండే దివాకర్‌ ఈ కేసును ఎలాగైనా ఛేదించి మంచి పేరు సంపాదించాలని నిశ్చయించుకుంటాడు. అలా లక్ష్యాన్ని చేరుకోవడానికి హీరో పడే కష్టాలు.. ఈక్రమంలో పోలీసుల చేతిలో హీరో ఎదుర్కొనే అవమానాలు.. వింత అనుభవాలు అద్భుతంగా చూపించారు.

జయతీర్థ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరో డిటెక్టీవ్‌ దివాకర్‌గా కన్న నటుడు రిషబ్‌శెట్టి నటించారు. హరిప్రియ కథానాయిక. ‘ఆహా’లో డిసెంబరు 11న విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్రబృందం ట్రైలర్‌ను విడుదల చేసింది. నవ్వులు పూయిస్తున్న ఈ ట్రైలర్‌ను మీరూ చూసేయండి మరి.

ఇదీ చదవండి

డిటెక్టివ్‌ దివాకరం రంగంలోకి దిగితే..!


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని