Bellamkonda Ganesh: అప్పుడు రిలీజ్ డేట్ సరిగ్గా ప్లాన్ చేయలేదనే టాక్ వినిపించింది: బెల్లంకొండ గణేశ్
‘నేను స్టూడెంట్ సర్’ (Nenu Student Sir) సినిమా విశేషాలను మీడియాతో పంచుకున్నారు నటుడు బెల్లంకొండ గణేశ్ (Bellamkonda Ganesh Babu).
ఇంటర్నెట్‌డెస్క్: ‘స్వాతిముత్యం’తో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన యువ కథానాయకుడు బెల్లంకొండ గణేశ్ (Bellamkonda Ganesh Babu). తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్ని అందుకున్న ఆయన నటిస్తున్న సరికొత్త చిత్రం ‘నేను స్టూడెంట్ సర్’ (Nenu Student Sir). రాకేష్ ఉప్పలపాటి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఎస్వీ2 ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సతీశ్ వర్మ దీన్ని నిర్మించారు. అవంతిక కథానాయిక. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపుదిద్దుకున్న ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలకు ఇప్పటికే మంచి స్పందన లభించింది. జూన్ 2న ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా విశేషాలను తాజాగా గణేశ్ విలేకర్లతో పంచుకున్నారిలా..!
‘నేను స్టూడెంట్ సర్’ సినిమా ఎలా ఉండనుంది..?
బెల్లంకొండ గణేశ్:నేను ఎప్పటికీ నిత్య విద్యార్థిగానే ఫీలవుతుంటా. నిజ జీవితంలో చూసే పరిస్థితులనే విభిన్నంగా చూపించాం. ఈ సినిమాలో విలన్ ఎవరు? అనేది క్లైమాక్స్ వరకూ ఎవరూ గుర్తుపట్టలేరు. అది మాత్రం పక్కా.
ఈ కథలో మిమ్మల్ని బాగా ఆకట్టుకున్న విషయాలు ఏమిటి?
బెల్లంకొండ గణేశ్: ఈ కథని కృష్ణ చైతన్య రాయగా.. స్క్రీన్ ప్లే, డైరెక్షన్ రాకేష్ చేశారు. కృష్ణ చైతన్య కథ చెప్పినప్పుడు బాగా కనెక్ట్ అయ్యాను. ఇదొక కొత్త తరహా థ్రిల్లర్. ఒక ట్విస్ట్ రివీల్ కాగానే మరో ట్విస్ట్ వస్తుంది. రాకేష్‌తో మా అన్నయ్యకు మంచి అనుబంధం ఉంది. తేజ నిర్మాణంలో ఆయన ఒక వెబ్ మూవీ చేశారు. అది మమ్మల్ని ఎంతో ఆకట్టుకుంది. ఆయనైతే ఈ సినిమాకు న్యాయం చేయగలరని భావించాం. ఇక, నిర్మాత సతీశ్.. ప్రొడక్షన్ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు.
ఈ సినిమా మీ కెరీర్‌కు ఎంతవరకూ ప్లస్ అవుతుందని నమ్ముతున్నారు?
బెల్లంకొండ గణేశ్: చాలా మంది పెద్ద హీరోలు వారి రెండో సినిమాలో స్టూడెంట్ పాత్ర చేశారు. ఇది నాకు మంచి బూస్ట్ అవుతుంది.
‘మైనే ప్యార్ కియా’ ఫేమ్ భాగ్యశ్రీ కుమార్తె అవంతికను హీరోయిన్‌గా తీసుకోవడానికి కారణం ఏమిటి?
బెల్లంకొండ గణేశ్: మా అన్నయ్య నటించిన ‘ఛత్రపతి’ (హిందీ వెర్షన్)లో భాగ్యశ్రీ నటించారు. ఆ సినిమా షూట్ అప్పుడు అవంతికను తెలుగులో లాంఛ్ చేయాలనుకుంటున్నట్లు ఆమె చెప్పారు. అలా, అవంతికను ఈ సినిమాలోకి తీసుకున్నాం.
‘స్వాతిముత్యం’కు మంచి టాక్ వచ్చినప్పటికీ థియేటర్లలో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమాపై ఎలాంటి అంచనాలు పెట్టుకున్నారు?
బెల్లంకొండ గణేశ్: ‘స్వాతిముత్యం’ రిలీజ్ చేసినప్పుడు పెద్ద హీరోల సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. రిలీజ్ డేట్ సరిగ్గా ప్లాన్ చేయలేకపోయాం అనే టాక్ వచ్చింది. ఆ సమయంలో మాదొక్కటే ఫ్యామిలీ సినిమా కాబట్టి పండక్కి ఆడే ఛాన్స్ ఉంటుందనే నమ్మకంతో నిర్మాతలు ఆ డేట్‌కే ఫిక్స్ అయ్యారు. థియేటర్‌లో ఇంకా ఆడాల్సింది. కాకపోతే వీలుపడలేదు. అయితే, ఓటీటీలో దానికి అద్భుతమైన స్పందన వచ్చింది. ఆ విషయంలో నటుడిగా నేను సక్సెస్ అయ్యాననే భావిస్తా. ఇప్పుడు ‘నేను స్టూడెంట్ సర్’ పై మాకు పూర్తి నమ్మకంగా ఉంది. ఈ సారి మంచి రిలీజ్ డేట్‌తో వస్తున్నా.
మీ సోదరుడితో ఇంట్లో సినిమాల గురించి మాట్లాడుతుంటారా?
బెల్లంకొండ గణేశ్: లేదు. ఇంట్లో అలాంటి చర్చలు ఏమీ ఉండవు.
సముద్రఖని పాత్ర ఎలా ఉండనుంది?
బెల్లంకొండ గణేశ్: సముద్రఖని ఈ సినిమాకి మరో బలం. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. చాలా మంచి పాత్ర పోషించారాయన.
తదుపరి చేయనున్న ప్రాజెక్టులు ఏమిటి?
బెల్లంకొండ గణేశ్: దీని తర్వాత ఒక క్రైమ్ కామెడీ చేస్తున్నా. తొలి రెండు చిత్రాలకు పూర్తి భిన్నంగా ఉంటుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Nara Bhuvaneshwari: అమరావతి నిర్మాణం జరిగి తీరుతుంది: నారా భువనేశ్వరి
-
World Cup-Dhoni: అఫ్గానిస్థాన్ టీమ్ మెంటార్‌గా భారత మాజీ క్రికెటర్.. ధోనీ మళ్లీ పాత లుక్‌లో!
-
Elon Musk: ఎక్స్‌లో వీడియో గేమ్ స్ట్రీమింగ్.. కొత్త ఫీచర్‌ను పరిచయం చేసిన మస్క్
-
Assam: బాల్య వివాహాలు.. అస్సాంలో మరోసారి అరెస్టులు
-
Festival Sale: ఐఫోన్, పిక్సెల్, నథింగ్.. ప్రీమియం ఫోన్లపై పండగ ఆఫర్లివే!
-
Nobel Prize: భౌతిక శాస్త్రంలో ఈ ఏడాది ముగ్గురికి నోబెల్