Bellamkonda Ganesh: తొలి పది చిత్రాల్ని అలా చేయాలనుకున్నా!
‘‘చాలా మంది అగ్ర హీరోలు వాళ్ల రెండో సినిమాలో స్టూడెంట్‌గానే నటించారు. మంచి విజయాన్ని అందుకున్నారు.
‘‘చాలా మంది అగ్ర హీరోలు వాళ్ల రెండో సినిమాలో స్టూడెంట్‌గానే నటించారు. మంచి విజయాన్ని అందుకున్నారు. అలా నా కెరీర్‌కీ ఈ సినిమా మేలు చేస్తుందని నమ్ముతున్నా’’ అన్నారు బెల్లంకొండ గణేశ్. ‘స్వాతిముత్యం’తో కథానాయకుడిగా పరిచయమైన ఆయన తన నటనతో మెప్పించారు. రెండో చిత్రంగా ‘నేను స్టూడెంట్ సర్!’ చేశారు. ఆ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా బెల్లంకొండ గణేశ్ బుధవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు. ఆ విషయాలివీ...
‘‘మంచి నటుడిగా నన్ను నేను నిరూపించుకోవాలి. దర్శకనిర్మాతల్లో నాపైన ఓ ప్రత్యేకమైన నమ్మకాన్ని సృష్టించుకోవాలి. అందుకే మొదటి పది సినిమాల్ని పది విభిన్నమైన కథలతో చేయాలనుకున్నా. అందులో భాగమే ఇప్పుడు చేస్తున్న సినిమాలన్నీ. ‘నేను స్టూడెంట్ సర్!’ ఓ కొత్తతరం థ్రిల్లర్ సినిమా. ఐఫోన్ కొనాలనే కోరిక ఉన్న ఓ విద్యార్థి చుట్టూ ఈ కథ సాగుతుంది. కృష్ణచైతన్య ఈ కథ చెప్పినప్పుడు ఇందులోని పాత్రల నిర్మాణానికీ, భావోద్వేగాలకీ బాగా కనెక్ట్ అయ్యా. స్వతహాగా నాకు నేను ఎప్పుడూ ఓ విద్యార్థిలానే భావిస్తుంటా. నిజ జీవితంలో జరిగే సంఘటనల్ని ఇందులో చాలా బాగా చూపించారు దర్శకుడు. ఆరంభం నుంచి చివరి వరకూ ఓ ప్రత్యేకమైన ఆసక్తితో కథ సాగుతుంది. పతాక సన్నివేశాల వరకూ ప్రతినాయకుడు ఎవరనేది కూడా ఊహించలేం. అంతగా థ్రిల్‘ చేస్తుందీ చిత్రం’’.
* ‘‘తొలి సినిమా ‘స్వాతిముత్యం’లో నా పాత్ర ఆరంభం నుంచీ చివరి వరకూ అమాయకంగానే కనిపిస్తుంటుంది. ఈ సినిమాలో మాత్రం భిన్న కోణాలు ఉంటాయి. ఆరంభంలో సంతోషంగా... మధ్యలోకి వచ్చేసరికి బాధ, ఉత్కంఠతో సతమతమవుతూ కనిపిస్తాడు హీరో. చివర్లో తనకి ఎదురయ్యే కష్టాలపై తిరగుబాటు చేస్తాడు. ఇలా పాత్ర నిర్మాణంలో భిన్న పార్శ్వాలు కనిపిస్తాయి. దర్శకుడు రాకేశ్ మా అన్నయ్యతో సినిమా కోసం రెండేళ్లుగా ప్రయాణం చేస్తున్నారు. తను చేసిన ఓ వెబ్ సినిమా చూసి, ఈ కథని బాగా తీయగలడని ఆయనకి అప్పజెప్పాం. ఆయన చాలా బాగా తీశారు. నిర్మాత సతీశ్ వర్మ ‘నాంది’ తర్వాత తీసిన సినిమా ఇది. ఈ సినిమా కోసం మరింత తపనతో పనిచేశారు. అత్యున్నత నిర్మాణ విలువలు కనిపిస్తాయి. సముద్రఖని, అవంతిక పాత్రలు కూడా చాలా బాగుంటాయి. మహతి స్వరసాగర్ రెండు పాటలతోపాటు, మంచి నేపథ్య సంగీతం అందించారు’’.
* ‘‘మా ఇంట్లో సినిమాలకి సంబంధించిన చర్చలేమీ ఉండవు. మా అన్న ఒకలాంటి సినిమాలు చేస్తే, నేను అందుకు భిన్నంగా చేయాలనే వ్యూహాలేమీ లేవు. రకరకాల జోనర్లు చేస్తూ వెళ్లాలనేదే నా ప్రయత్నం. నా తొలి సినిమా ‘స్వాతిముత్యం’ నటుడిగా నాకు మంచి పేరే తెచ్చింది. ఆశించిన స్థాయిలో ఆడకపోయినా మంచి సినిమా చేశావని ఇప్పటికీ మెచ్చుకుంటుంటారు. అప్పట్లో పండగకి విడుదలయ్యే సినిమాల్లో మనదొక్కటే కుటుంబ కథా చిత్రం అని ‘స్వాతిముత్యం’ని విడుదల చేశాం. ఓటీటీలో మాత్రం మంచి స్పందన వచ్చింది. ‘నేను స్టూడెంట్ సర్’ తర్వాత క్రైమ్ కామెడీ కథని చేయబోతున్నా. తొలి రెండు చిత్రాలకి భిన్నమైన కథ అది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: వన్డే వరల్డ్ కప్.. అక్షర్ పటేల్ ఔట్.. అశ్విన్‌కు చోటు
-
Congress: ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన మైనంపల్లి, వేముల వీరేశం
-
Siddharth: సిద్ధార్థ్‌కు చేదు అనుభవం.. ప్రెస్‌మీట్ నుంచి వెళ్లిపోయిన హీరో
-
Nitin Gadkari: ఏడాది చివరికల్లా గుంతలు లేని జాతీయ రహదారులు: నితిన్ గడ్కరీ
-
Adilabad: గణేశ్ నిమజ్జనంలో సందడి చేసిన WWE స్టార్
-
Ramesh Bidhuri: భాజపా ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు.. ప్రివిలేజ్ కమిటీకి స్పీకర్ సిఫార్సు