Bellamkonda Sreenivas: ‘ఛత్రపతి’ ఫ్లాప్‌పై బెల్లంకొండ శ్రీనివాస్‌ ఆసక్తికర వ్యాఖ్యలు

‘ఛత్రపతి’ (హిందీ వెర్షన్‌) పరాజయంపై తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ (Bellamkonda Sreenivas) స్పందించారు.

Published : 17 May 2023 21:26 IST

హైదరాబాద్‌: ‘ఛత్రపతి’ (Chatrapathi) రీమేక్‌తో బాలీవుడ్‌లో తనకంటూ ఓ ఇమేజ్‌ క్రియేట్‌ చేసుకోవాలని ఎంతో శ్రమించారు తెలుగు నటుడు బెల్లంకొండ శ్రీనివాస్‌ (Bellamkonda Sai Sreenivas). వి.వి.వినాయక్‌ (V.V.Vinayak) దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలై అనుకోని విధంగా పరాజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలోనే ‘ఛత్రపతి’ ఫ్లాప్‌పై శ్రీనివాస్‌ తాజాగా స్పందించారు. ‘ఆశల నుంచే స్ఫూర్తి లభిస్తుంది’ అని పేర్కొన్న ఆయన.. ‘‘జీవితంలో ఎన్నో విషయాలను నేర్చుకోవడంతో నేను ఇక్కడికి చేరుకోగలిగాను. నా ప్రయాణంలో ఎదురుదెబ్బలు తగలవచ్చు. అయినప్పటికీ, నా మనసు కోరుకునే ఆనందాన్ని అందించడం కోసం కష్టపడి పనిచేయాలనేదే నా అజెండా’’ అని రాసుకొచ్చారు.

రాజమౌళి-ప్రభాస్‌ కాంబోలో వచ్చిన ‘ఛత్రపతి’కి రీమేక్‌గా ఇది తెరకెక్కింది. తాను నటించిన తెలుగు చిత్రాలకు (డబ్బింగ్‌ వెర్షన్‌) యూట్యూబ్‌లో విశేష ఆదరణ ఉందని, దానిని దృష్టిలో ఉంచుకునే ‘ఛత్రపతి’ రీమేక్‌తో ఉత్తరాది ప్రేక్షకులను అలరించాలని శ్రీనివాస్‌ భావించారు. నుష్రత్‌, భాగ్యశ్రీ, కరణ్‌ సింగ్‌ వంటి తారాగణంతో సిద్ధమైన ఈ సినిమా మే 12న విడుదలై పరాజయాన్ని అందుకుంది.  రీమేక్‌ ప్రేక్షకులకు చేరువయ్యేలా సినిమాని తెరకెక్కించడంలో ఈ టీమ్‌ విఫలమైందని సినీ విశ్లేషకులు పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని