bellamkonda sai sreenivas: ప్రపంచ రికార్డు సృష్టించిన బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ సినిమా

‘ఛత్రపతి’తో బాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమయ్యాడు నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ (Bellamkonda Sai Sreenivas). తాజాగా ఆయన సినిమా ప్రత్యేక ఘనత సాధించింది.

Published : 29 Mar 2023 15:06 IST

హైదరాబాద్‌: నటుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ (bellamkonda sai sreenivas) ప్రత్యేక ఘనత సాధించాడు. ఆయన నటించిన ‘జయ జానకి నాయక’ హిందీ వెర్షన్‌ ప్రపంచ రికార్డు సృష్టించింది. ‘ఖూన్ఖర్‌’ పేరుతో యూట్యూబ్‌లో విడుదలైన ఈ సినిమా ఇప్పటివరకూ 709 మిలియన్ల కంటే ఎక్కువ వ్యూస్‌  సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ అందుకున్న చిత్రంగా ఘనత సాధించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ ద్వారకా క్రియేషన్స్‌ ప్రత్యేక పోస్టర్‌ షేర్‌ చేసింది. తమ చిత్రానికి ఇంతటి మంచి విజయాన్ని అందించిన సినీ ప్రియులకు ధన్యవాదాలు చెప్పింది. అలాగే చిత్రబృందం మొత్తానికి అభినందనలు తెలిపింది.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ నటించిన మూడో చిత్రమిది. బోయపాటి శ్రీను దర్శకుడు. రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కథానాయిక. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈసినిమా 2017లో విడుదలైంది. తెలుగుతోపాటు హిందీలోనూ ఇది మంచి టాక్‌ అందుకుంది. ఇక, సాయి శ్రీనివాస్‌ ప్రస్తుతం బాలీవుడ్‌పై దృష్టి సారించిన సంగతి తెలిసిందే. ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌తో ఆయన బీటౌన్‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు. మే 12న ఇది రిలీజ్‌ కానుంది.
 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు