Bellamkonda Sai sreenivas: సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ

ఈ వేసవిలోనే ‘ఛత్రపతి’గా సందడి చేయనున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్‌. ఆయన కథానాయకుడిగా నటించనున్న తదుపరి చిత్రం ఖరారైంది.  ‘భీమ్లానాయక్‌’ ఫేం సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహించనున్న ఆ చిత్రాన్ని రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మించనున్నారు. గురువారమే సినిమాని ప్రకటించాయి చిత్రవర్గాలు.

Updated : 31 Mar 2023 07:03 IST

వేసవిలోనే ‘ఛత్రపతి’గా సందడి చేయనున్నాడు బెల్లంకొండ శ్రీనివాస్‌ (Bellamkonda Sai Sreenivas). ఆయన కథానాయకుడిగా నటించనున్న తదుపరి చిత్రం ఖరారైంది.  ‘భీమ్లానాయక్‌’ ఫేం సాగర్‌ కె.చంద్ర దర్శకత్వం వహించనున్న ఆ చిత్రాన్ని రామ్‌ ఆచంట, గోపి ఆచంట నిర్మించనున్నారు. గురువారమే సినిమాని ప్రకటించాయి చిత్రవర్గాలు. ‘‘విభిన్నమైన కథలతో వాణిజ్య ప్రధానమైన సినిమాలు చేయడడంలో సిద్ధహస్తుడు సాగర్‌ కె.చంద్ర. బెల్లంకొండ కోసం ఒక మంచి స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. మాస్‌ యాక్షన్‌ సినిమాగా భారీ వ్యయంతో రూపొందనుంద’’ని సినీ వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని