Bellamkonda Sai Sreenivas: కొత్త సినిమా మొదలు

ఇటీవలే ‘ఛత్రపతి’గా ఉత్తరాది ప్రేక్షకుల్ని పలకరించారు బెల్లంకొండ శ్రీనివాస్‌. ఇప్పుడాయన సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు.

Updated : 02 Jun 2023 12:50 IST

టీవలే ‘ఛత్రపతి’గా ఉత్తరాది ప్రేక్షకుల్ని పలకరించారు బెల్లంకొండ శ్రీనివాస్‌ (Bellamkonda Sai Sreenivas). ఇప్పుడాయన సాగర్‌ కె.చంద్ర దర్శకత్వంలో కొత్త చిత్రానికి శ్రీకారం చుట్టారు. 14రీల్స్‌ ప్లస్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీ ఆచంట నిర్మిస్తున్నారు. ఈ సినిమా గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి హరీష్‌ శంకర్‌ క్లాప్‌ కొట్టగా.. పరశురామ్‌ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. అనంతరం వీరిద్దరూ కలిసి చిత్ర బృందానికి స్క్రిప్ట్‌ అందించారు. అనిల్‌ రావిపూడి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ‘‘వినూత్నమైన కథాంశంతో రూపొందనున్న యాక్షన్‌ చిత్రమిది’’ అని చిత్ర నిర్మాతలు తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు