‘మై నే ప్యార్‌కియా’లో నటించొద్దనుకున్నాను: భాగ్యశ్రీ
బాలీవుడ్‌లో ‘మై నే ప్యార్ కియా’ ఎంతటి సూపర్‌హిట్టో అందరికి తెలిసిందే. తెలుగులో ‘ప్రేమ పావురాలు’గా విడుదలై బంపర్‌హిట్ కొట్టింది. ఆ చిత్రంలో భాగ్యశ్రీ, సల్మాన్‌ల నటన అంతలా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి అలాంటి సూపర్‌హిట్ సినిమాలో నాటి
ముంబయి: బాలీవుడ్‌లో ‘మై నే ప్యార్ కియా’ ఎంతటి సూపర్‌హిట్టో అందరికి తెలిసిందే. ‘ప్రేమ పావురాలు’గా విడుదలై తెలుగు ప్రేక్షకులకూ ఈ సినిమా సుపరిచితమే. ఈ చిత్రంలో భాగ్యశ్రీ, సల్మాన్‌ల నటన అంతలా ప్రేక్షకులను ఆకట్టుకుంది. మరి అలాంటి సూపర్‌హిట్ సినిమాలో నాటి హిరోయిన్ భాగ్యశ్రీ నటించకూడదనుకున్నారటా! ఈ విషయం స్వయంగా ఆవిడే ఒక ఇంటర్వ్యూలో చెప్పటం విశేషం. ‘‘ నాకు నటిగా బాగా పేరుతెచ్చిపెట్టిన ‘మై నే ప్యార్ కియా’ చిత్రంలో మొదట నటించకూడదని అనుకున్నా. అందుకు కారణం చదువు నిమిత్తం విదేశాలకు వెళ్లే ఉద్దేశం ఉండటమే. మా నాన్న మాత్రం ఇండియాలోనే చదువు పూర్తి చేయాలని నాతో వాదించేవారు. ఆ సమయంలోనే చిత్ర దర్శకులు సూరజ్ బర్జత్యా నాకు స్క్రిప్ట్ వినిపించారు. ఆయన మొదటిసారి నేరేట్ చేసినపుడే ఆ స్క్రిప్ట్ నాకు చాలా నచ్చింది. కానీ నాకు విదేశాలకు వెళ్లాలనే ఆలోచన ఉండటంతో నో చెప్పేదాన్ని. అయినప్పటికి సూరజ్ పట్టువిడకుండా స్క్రిప్ట్‌లో మార్పులు, చేర్పులు చేస్తూ మొత్తం ఎనిమిది సార్లు నాకు వినిపించారు. అన్ని సార్లు ఏదోక కారణం చెప్పిన నేను చివరికి ఈ చిత్రం చేస్తునట్టు అంగీకారం తెలిపాను. ఫలితం నా కెరీర్‌లోనే బంపర్‌హిట్’ అంటూ అప్పటి సంగతిని గుర్తు చేసుకున్నారు. ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌గా ఉన్నాయి. ప్రస్తుతం భాగ్యశ్రీ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాథేశ్యామ్’లో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇదీ చదవండి!
రకుల్ సూక్తులు.. వేదిక మ్యాజిక్కులు
రామతీర్థంలో సోము వీర్రాజు అరెస్ట్
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Taliban: బంధుప్రీతిపై తాలిబన్ల కన్నెర్ర..!
-
India News
Shocking: షాకింగ్.. డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి ప్రభుత్వ ఉద్యోగి మృతి!
-
World News
Japan: చైనాకు చెక్ పెట్టేలా.. రూ.6 లక్షల కోట్లతో భారీ ప్రణాళిక!
-
Sports News
Virender Sehwag: టీమ్ఇండియా కోచింగ్ ఆఫర్.. నాకు ఆ అవకాశం రాలేదు!:సెహ్వాగ్
-
Movies News
Vishwak Sen: ఇండస్ట్రీలో నన్నెవరూ తొక్కేయాలనుకోలేదు.. విశ్వక్సేన్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
General News
SSC: కానిస్టేబుల్(జీడీ) అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. పోస్టుల సంఖ్య 50,187కి పెంపు