Prabhas: వీరుడినే... యోధుడినే

నా గమనం... నిత్య రణం అంటూ నినదిస్తున్నాడు భైరవ. మరి ఆయన కథేమిటో తెలియాలంటే ‘కల్కి 2898 ఎ.డి’ చూడాల్సిందే.

Updated : 17 Jun 2024 09:23 IST

నా గమనం... నిత్య రణం అంటూ నినదిస్తున్నాడు భైరవ. మరి ఆయన కథేమిటో తెలియాలంటే ‘కల్కి 2898 ఎ.డి’ చూడాల్సిందే. ప్రభాస్‌ కథానాయకుడిగా వైజయంతీ మూవీస్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రమిది. దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ కీలక పాత్రలు పోషించారు. నాగ్‌ అశ్విన్‌ దర్శకుడు. సి.అశ్వనీదత్‌ నిర్మాత. ఈ నెల 27న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఇందులో బైరవ పాత్రలో ప్రభాస్‌ సందడి చేయనున్నారు. ఆదివారం భైరవ పాటని విడుదల చేశారు. ‘ఒక నేనే... నాకు చుట్టూ నేనే. ఒక్కటైనా ఒంటరోణ్ని కానే. వీరుడినే... యోధుడినే. భూమి నేనే సూర్యుడైన నేనే, నన్ను నేనే చుట్టి తిరుగుతానే, స్వార్థము నేనే పరమార్థము నేనే...’ అంటూ సాగే ఈ పాట తెలుగు, హిందీ భాషల్లో సాగుతుంది. రామజోగయ్య శాస్త్రి, కుమార్‌ రచించగా... దిల్జీత్‌ దోసాంజ్, దీపక్‌ బ్లూ ఆలపించారు. సంతోష్‌ నారాయణన్‌ స్వరపరిచారు. లిరికల్‌ వీడియోలో ప్రభాస్‌ మెరుపులు ఆకట్టుకున్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని