Bhala Thandhanana: ‘భళా తందనాన’ ఓటీటీలోకి ఎప్పుడంటే..!

చైతన్య దంతులూరి దర్శకత్వంలో శ్రీవిష్ణు నటించిన చిత్రం ‘భళా తందనాన’. ఈ సినిమాలో కేథరిన్‌తో జోడి కట్టాడు శ్రీవిష్ణు.

Published : 13 May 2022 13:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చైతన్య దంతులూరి దర్శకత్వంలో శ్రీవిష్ణు నటించిన చిత్రం ‘భళా తందనాన’. ఈ సినిమాలో కేథరిన్‌తో జోడి కట్టాడు శ్రీవిష్ణు. అవినీతి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా మే6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విభిన్న కథాంశం అయినప్పటికీ ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను అలరించలేకపోయింది. ఒక జర్నలిస్ట్‌తో కలిసి సామాన్య వ్యక్తి చేసిన పోరాటంగా వచ్చిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు సిద్ధమైంది. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా మే 20 నుంచి ఈ చిత్రం డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లో అలరించనుంది. ఈ మేరకు చిత్రబృందం ట్విట్‌ చేసి పోస్టర్‌ను విడుదల చేసింది. వారాహి చలన చిత్రం పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాకు సాయి కొర్రపాటి సమర్పకులు. రామచంద్రరాజు, శ్రీనివాస్‌రెడ్డి, సత్య నటించిన ఈ చిత్రానికి స్వరబ్రహ్మ మణిశర్మ సంగీతం అందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని