Bhala Thandhanana: ‘భళా తందనాన’ ఓటీటీ ట్రైలర్‌ చూశారా..!

శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం ‘భళా తందనాన’. ఈ సినిమాకు చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన కేథరిన్‌ నటించింది.

Published : 16 May 2022 14:13 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీవిష్ణు నటించిన తాజా చిత్రం ‘భళా తందనాన’. ఈ సినిమాకు చైతన్య దంతులూరి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో శ్రీ విష్ణు సరసన కేథరిన్‌ నటించింది. అవినీతి నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం మే6న ప్రేక్షకుల ముందుకు వచ్చినా ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయింది. జర్నలిస్టుతో కలిసి సామాన్య వ్యక్తి ప్రజల కోసం చేసిన పోరాటంగా తెరకెక్కిన ఈ సినిమా మే20న ఓటీటీలో విడుదల కానుంది. డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌ వేదికగా డిజిటల్‌ ప్రేక్షకులను అలరించనుంది. దీనికి సంబంధించిన ఓటీటీ ట్రైలర్‌ను ఈ రోజు విడుదల చేశారు. వారాహి చలన చిత్ర పతాకంపై రజనీ కొర్రపాటి నిర్మించిన ఈ సినిమాకు సాయి కొర్రపాటి సమర్పకులు. మణిశర్మ సంగీతం అందించిన ఈ చిత్రంలో రామచంద్రరాజు, శ్రీనివాస్‌ రెడ్డి, సత్య నటించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని