Acharya: చిరు- చరణ్‌ ‘సిరుత పులుల సిందాట’.. చూస్తే వావ్‌ అనాల్సిందే!

చిరంజీవి- రామ్‌చరణ్‌ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తేనే చాలు అభిమానులకు పండగలా ఉంటుంది. అలాంటిది వీరిద్దరు కలిసి డ్యాన్స్‌ చేస్తే? ఆ మజా ఏ రేంజ్‌లో ఉంటుందో తాజాగా విడుదలైన ‘భలే భలే బంజారా.. సిరుత పులుల సిందాట’ గీతం చూపించింది.

Updated : 18 Apr 2022 17:15 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిరంజీవి- రామ్‌చరణ్‌ ఒకే ఫ్రేమ్‌లో నిలబడితేనే అభిమానులకు పండగలా ఉంటుంది. అలాంటిది వీరిద్దరు కలిసి డ్యాన్స్‌ చేస్తే? ఆ మజా ఏ రేంజ్‌లో ఉంటుందో తాజాగా విడుదలైన ‘భలే భలే బంజారా.. సిరుత పులుల సిందాట’ గీతం చూపించింది. ఇందులో శేఖర్‌ మాస్టర్‌ తీర్చిదిద్దిన కూల్‌ స్టెప్పులు, కామ్రేడ్‌ లుక్కులు వావ్‌ అనిపించేలా ఉన్నాయి. మణిశర్మ సంగీతం, రామజోగయ్య శాస్త్రి సాహిత్యం, శంకర్‌ మహదేవన్‌, రాహుల్‌ సిప్లిగంజ్‌ గానం శ్రోతల్ని విశేషంగా అలరించేలా ఉన్నాయి.

కొరటాల శివ తెరకెక్కించిన ‘ఆచార్య’ చిత్రంలోని పాట ఇది. ఏప్రిల్‌ 29న సినిమాను విడుదల చేస్తున్న సందర్భంగా సోమవారం ఈ గీతాన్ని చిత్ర బృందం పంచుకుంది. ధర్మస్థలి అనే దేవాలయ నగరి, నక్సలిజం నేపథ్యంలో రూపొందిన ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్‌ అగర్వాల్‌, రామ్‌చరణ్‌కు జోడీగా పూజాహెగ్డే నటించారు. ఈ సినిమాని నిరంజన్‌ రెడ్డి, అన్వేష్‌రెడ్డి సంయుక్తంగా నిర్మించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని