Bhanushree: సినీ పరిశ్రమలో ఉన్న నిజమైన సమస్య ఇదే.. ‘వరుడు’ హీరోయిన్‌ కామెంట్స్‌

‘వరుడు’తో తెలుగు వారికి చేరువైన నటి భానుశ్రీ మెహ్రా (Bhanushree Mehra). అల్లు అర్జున్‌ (Allu Arjun) తనని ట్విటర్‌లో బ్లాక్‌ చేశారంటూ ఇటీవల వార్తల్లో నిలిచిన ఆమె.. తాజాగా సినీ పరిశ్రమపై షాకింగ్‌ కామెంట్స్‌ చేశారు.

Published : 25 Mar 2023 11:30 IST

హైదరాబాద్‌: వయసు అనేది సినీ పరిశ్రమలో ఉన్న అతి పెద్ద సమస్య అని నటి భానుశ్రీ మెహ్రా (Bhanushree Mehra) అన్నారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఆమె తాజాగా ట్వీట్‌ చేశారు.

‘‘వయసు.. సినిమా పరిశ్రమలో ఉన్న నిజమైన సమస్య. ఒక వయసు వచ్చిన తర్వాత స్త్రీలను కేవలం తల్లి పాత్రలకే పరిమితం చేస్తారు. పురుషులకు వచ్చేసరికి అది వర్తించదు. వాళ్లు ఎప్పటిలాగానే ప్రధాన పాత్రల్లో నటిస్తుంటారు. తమకంటే వయసులో చాలా చిన్నవారికి ప్రేమికుడిగా కనిపిస్తారు. స్త్రీ విలువను వయసు లేదా ఆమె వైవాహిక స్థితిని ఆధారంగా చేసుకుని ఎలా నిర్ణయిస్తారు? పాత పద్ధతికి ఇకనైనా స్వస్తి పలకండి. ధైర్యవంతులు, స్వతంత్రంగా ఉన్న మహిళల కథలను చెప్పండి. అన్ని వయసుల మహిళలను పరిశ్రమ ప్రోత్సహించాల్సిన సమయం ఇది. దీనిని మీరూ అంగీకరిస్తారా?’’ అని భానుశ్రీ ప్రశ్నించారు. దీనిని చూసిన నెటిజన్లు కామెంట్స్ రూపంలో తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని కొంతమంది అంగీకరిస్తుంటే.. మరికొంతమంది మాత్రం ఇదేమీ పెద్ద సమస్య కాదని అంటున్నారు. వయసు కంటే హార్డ్‌వర్క్‌ ఎంతో ముఖ్యమని.. పెళ్లి తర్వాత కూడా పలువురు నటీమణులు సినిమాల్లో చేస్తున్నారంటూ చెబుతున్నారు.

అల్లు అర్జున్‌ (Allu Arjun) నటించిన ‘వరుడు’ (Varudu)తో తెలుగు తెరకు పరిచయమయ్యారు భానుశ్రీ (Bhanushree). భారీ అంచనాల మధ్య విడుదలైన ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద పరాజయాన్ని అందుకుంది. దీంతో ఆమెకు అనుకున్నంత సక్సెస్‌ రాలేదు. 2021 వరకూ పలు తెలుగు చిత్రాల్లో నటించినప్పటికీ ఆమెకు విజయం దక్కలేదు. ప్రస్తుతం యూట్యూబ్‌ వేదికగా నెటిజన్లను ఆమె అలరిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు