Bharateeyudu 2: ‘భారతీయుడు 2’ టికెట్‌ ధరల పెంపునకు.. షరతుతో తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌

కమల్‌ హాసన్‌ హీరోగా శంకర్‌ తెరకెక్కించిన తాజా చిత్రం ‘భారతీయుడు 2’. ఈ సినిమా టికెట్‌ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.

Published : 10 Jul 2024 18:35 IST

హైదరాబాద్‌: ‘భారతీయుడు 2’ (Bharateeyudu 2) సినిమా టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ. 50, మల్టీప్లెక్స్‌ల్లో రూ. 75 పెంచుకునేందుకు (Bharateeyudu Ticket Price) వీలు కల్పించింది. సినిమా విడుదలకానున్న రోజు (శుక్రవారం) నుంచి ఈ నెల 19 వరకు ధరల పెంపునకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వారంపాటు ఐదో షోకూ అనుమతి ఇచ్చింది. సినిమా ప్రారంభానికి ముందు.. డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణపై ప్రకటనలు ప్రదర్శించాలనే షరతు పెట్టింది.

నటుడు కమల్‌ హాసన్‌ (Kamal Haasan)- దర్శకుడు శంకర్‌ (Shankar) కాంబినేషన్‌లో వచ్చిన హిట్‌ మూవీ ‘భారతీయుడు’కు సీక్వెల్‌గా రూపొందిందే ‘భారతీయుడు 2’. సిద్ధార్థ్‌, రకుల్‌ప్రీత్‌ సింగ్‌, బాబీ సింహా తదితరులు కీలక పాత్రలు పోషించారు. కమల్‌ హాసన్‌ మరోసారి సేనాపతిగా కనిపించనుండడంతో సీక్వెల్‌పై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఈ మూవీ ఈ నెల 12న బాక్సాఫీసు ముందుకు రానుంది.

‘భారతీయుడు’ కోసం ఈ తెలుగు హీరోలను అనుకున్నారు కానీ..

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని