పరిచయమైన ఆరో రోజే పెళ్లన్నాడు: మెహరీన్‌

‘కృష్ణగాడి వీరప్రేమగాథ’లో మహాలక్ష్మిగా మెప్పించి.. ‘ఎఫ్‌-2’లో హనీగా అలరించిన పంజాబీ ముద్దుగుమ్మ మెహరీన్‌. ఇటీవల ఈ నటి నిశ్చితార్థం రాజకీయనేత భవ్య బిష్ణోయ్‌తో వేడుకగా జరిగింది. ఈ నేపథ్యంలో తన లైఫ్‌ పార్ట్నర్‌ గురించి...

Updated : 20 Mar 2021 11:53 IST

భవ్యతో మెహరీన్‌ ప్రయాణమిలా..

హైదరాబాద్‌: ‘కృష్ణగాడి వీరప్రేమగాథ’లో మహాలక్ష్మిగా మెప్పించి.. ‘ఎఫ్‌-2’లో హనీగా అలరించిన పంజాబీ ముద్దుగుమ్మ మెహరీన్‌. ఇటీవల ఈ నటి నిశ్చితార్థం భవ్య బిష్ణోయ్‌తో వేడుకగా జరిగింది. ఈ నేపథ్యంలో తన లైఫ్‌ పార్ట్నర్‌ గురించి మెహరీన్‌ కొన్ని విషయాలను పంచుకున్నారు. కాబోయే శ్రీవారు పరిచయమై కేవలం పది నెలలే అయినప్పటికీ జీవితకాలం అతనితో అనుబంధం ఉన్నట్లు అనిపిస్తుందని తెలిపారు.

‘‘మాది పెద్దలు కుదిర్చిన ప్రేమ వివాహం. గతేడాది లాక్‌డౌన్‌లోనే మాకు పరిచయం ఏర్పడింది. లాక్‌డౌన్‌ వల్ల మేమిద్దరం కలవలేకపోయాం. కానీ, పరిచయమైన నాటి నుంచి ప్రతిరోజూ మెస్సేజ్‌లు, ఫోన్లు చేసుకునేవాళ్లం. ఇద్దరి అభిప్రాయాలు, ఇష్టాయిష్టాలనూ పంచుకున్నాం. మేమిద్దరం మాట్లాడుకోవడం ప్రారంభించిన ఆరు రోజులకే తను నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నట్లు చెప్పాడు. ఆయన బర్త్‌డే సెలబ్రేషన్స్‌ కోసం గత నెల అండమాన్‌ వెళ్లాం. స్కూబా డైవింగ్‌ చేస్తున్న సమయంలో ‘విల్‌ యూ మ్యారీ మీ’ అనే కార్డుతో భవ్య నన్ను సర్‌ప్రైజ్ చేశాడు. నేను కూడా ఓకే చెప్పాను’’

‘‘నిశ్చితార్థ వేడుకకు సంబంధించిన ప్రతి విషయాన్ని మేమిద్దరమే దగ్గరుండి చూసుకున్నాం. ఎందుకంటే ఇది మా జీవితాల్లో ఎంతో ముఖ్యమైన వేడుక. నిశ్చితార్థం ఎక్కడ జరగాలి? ఎలాంటి ఫుడ్‌ అతిథులకు అందించాలి? బహుమతులు ఎలా ఉండాలి? డెకరేషన్స్‌... ఇలా ప్రతి చిన్న విషయాన్ని మేమిద్దరం ఎంతో ప్లాన్‌ చేసి సిద్ధం చేశాం. పెళ్లి డేట్‌ ఇంకా ఫిక్స్‌ కాలేదు. వింటర్‌ సీజన్‌లో వివాహం జరిగే అవకాశం ఉంది. మాది పక్కా డెస్టినేషన్‌ వెడ్డింగ్‌. నేను ఇప్పటి నుంచే ప్రణాళిక సిద్ధం చేస్తున్నాను’’ అని మెహరీన్‌ తెలిపారు. మరోవైపు, ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ ‘ఎఫ్‌-3’లో నటిస్తున్నారు.

Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని