Bheemla Nayak: హిందీలోకి ‘భీమ్లా నాయక్‌’.. ట్రైలర్‌ కట్‌ అదిరింది

తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన ‘భీమ్లా నాయక్‌’ సినిమా బాలీవుడ్‌లోకి వెళ్తుంది. ‘బీ 4 యు మోషన్‌ పిక్చర్స్‌’ సంస్థ ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తుంది.

Published : 04 Mar 2022 15:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: తెలుగు ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన ‘భీమ్లా నాయక్‌’ సినిమా బాలీవుడ్‌లోకి వెళ్తుంది. ‘బీ 4 యు మోషన్‌ పిక్చర్స్‌’ సంస్థ ఈ చిత్రాన్ని హిందీలో విడుదల చేస్తోంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ సోషల్‌ మీడియా వేదికగా ట్రైలర్‌ను పంచుకుంది. తెలుగు ట్రైలర్‌కు కాస్త విభిన్నంగా, తక్కువ నిడివితో రూపొందించిన ఈ ట్రైలర్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా హిందీ వెర్షన్‌ అతి త్వరలోనే విడుదలకానుంది. మలయాళ సూపర్‌ హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’కు రీమేక్‌గా తెరకెక్కిందీ ఈ చిత్రం. తెలుగు నేటివిటీ, పవన్‌ కల్యాణ్‌ ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకుని స్క్రిప్టులో చేసిన మార్పులు మంచి విజయాన్ని అందించాయి. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ మాటలు, స్క్రీన్‌ప్లే అందించారు. రానా కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో నిత్య మేనన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ నిర్మించిన ఈ సినిమాకి తమన్‌ స్వరాలందించారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని