Published : 10 Mar 2022 01:48 IST

Bheemla Nayak: ‘భీమ్లా నాయక్‌’.. పాటలన్నీ ఒకే చోట..

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘భీమ్లా నాయక్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ సందర్భంగా చిత్ర బృందం పాటల జ్యూక్‌బాక్స్‌ను పంచుకుంది. ఇందులో.. ఇప్పటికే విడుదల చేసిన టైటిల్‌ సాంగ్‌, ‘లాలా భీమ్లా’, ‘భీమ్లా బ్యాక్‌ ఆన్‌ డ్యూటీ’, ‘అంత ఇష్టం’తోపాటు మరో మూడు కొత్త పాటలున్నాయి. ‘అడవి గుసగుసలు’, ‘ఓ సందమామ’, ‘అడవి తల్లి మాట’.. అనే ఈ మూడు గీతాలు అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉన్నాయి. సినిమాలో కీలక సన్నివేశాల్లో వచ్చే పాటలివి.

మలయాళ సూపర్‌హిట్‌ ‘అయ్యప్పనుమ్‌ కోషియుమ్‌’కు రీమేక్‌గా ‘భీమ్లా నాయక్‌’ తెరకెక్కింది. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందించారు. తమన్‌ సంగీతం అందించారు. నిత్య మేనన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్స్‌ పతాకంపై సూర్య దేవర నాగవంశీ నిర్మించారు. 


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని