Bheemla Nayak: ‘భీమ్లా నాయక్‌’ పవర్‌ఫుల్‌ సాంగ్‌.. ఫుల్‌ వీడియో వచ్చేసింది

పవన్‌ కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భీమ్లా నాయక్‌’. ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది.

Updated : 07 Dec 2022 15:57 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పవన్‌ కల్యాణ్‌, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘భీమ్లా నాయక్‌’. ఫిబ్రవరి 25న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించింది. ఈ నెల 25 నుంచి ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’, ‘ఆహా’ ఓటీటీల్లో స్ట్రీమింగ్‌కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం టైటిల్‌ సాంగ్‌ ఫుల్‌ వీడియోను విడుదల చేసింది. ఈ పవర్‌ఫుల్‌ గీతానికి పవన్‌ కల్యాణ్‌ చేసిన డ్యాన్స్‌ అందరినీ ఆకట్టుకునేలా ఉంది. రామజోగయ్యశాస్త్రి రచించి, రామ్‌ మిర్యాల, పృథ్వీ చంద్ర ఆలపించి, తమన్‌ స్వరాలు సమకూర్చిన ఈ పాట లిరికల్‌ వీడియో రికార్డు స్థాయిలో వ్యూస్‌ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.

మలయాళంలో ఘన విజయం అందుకున్న ‘అయ్యప్పనుమ్‌ కోశియుమ్‌’కు రీమేక్‌గా ఈ చిత్రం రూపొందింది. సాగర్‌ కె. చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దర్శకుడు త్రివిక్రమ్‌ సంభాషణలు, స్క్రీన్‌ప్లే అందించారు. నిత్య మేనన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలుగా మెరిశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని