Bheemlanayak: కొత్త షాట్స్‌తో ‘భీమ్లానాయక్‌’ ట్రైలర్‌

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ఆహా, డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌లో మరో వారం రోజుల్లో పవర్‌ తుఫాన్‌ ప్రారంభం కానుంది. పవన్‌కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో నటించిన...

Published : 18 Mar 2022 13:11 IST

హైదరాబాద్‌: ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌ ఆహా, డిస్నీ ప్లస్ హాట్‌ స్టార్‌లో మరో వారం రోజుల్లో పవర్‌ తుఫాన్‌ ప్రారంభం కానుంది. పవన్‌కల్యాణ్‌, రానా ప్రధాన పాత్రల్లో నటించిన ‘భీమ్లానాయక్‌’ ఒకేసారి ఆ రెండు ఓటీటీల్లోనూ విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే ‘ఆహా’ ప్రమోషన్స్‌ షురూ చేసింది. దీనిలో భాగంగా థియేరిటికల్‌ ట్రైలర్‌లో చూడని కొన్ని సరికొత్త షాట్స్‌తో ‘భీమ్లానాయక్‌’ ట్రైలర్‌ని రూపొందించి శుక్రవారం ఉదయం విడుదల చేసింది. ‘‘అడవి తగలబడటం చూసినా.. పులి మీద పడటం చూసినా.. కానీ, ఆ పొత్తు నేను చూసింది వేరు దొర’’ అనే డైలాగ్‌లతో ప్రారంభమైన ఈ వీడియో పవన్‌కల్యాణ్‌ రానాల పవర్‌ఫుల్‌ పంచ్‌ డైలాగ్‌లతో సాగింది. ‘‘ఏయ్‌ పోలీస్‌.. నా లాంటి పెద్ద పెద్ద క్రిమినల్స్‌ని ఇంత ప్రీగా వదిలేస్తే ఎలా?’’ అంటూ రానా, ‘‘ఇలాంటి వాళ్లకి రూల్స్‌, రెగ్యులేషన్స్‌, మంచి, మర్యాద ఇలాంటివేమీ పనిచేయవు’’ అంటూ పవన్ చెప్పే డైలాగ్‌లు ఆకట్టుకునేలా ఉన్నాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని