Bhumika: 21ఏళ్ల తర్వాత ‘ఖుషి’ మ్యాజిక్‌ రీక్రియేట్‌ చేసిన భూమిక

‘అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా’.. ఈ పాట వింటే తెలుగు సినీ ప్రియులందరికీ పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, నటి భూమిక నటించిన ‘ఖుషి’ గుర్తుకువస్తుంది....

Published : 18 Feb 2022 14:13 IST

హైదరాబాద్‌: ‘అమ్మాయే సన్నగా అరనవ్వే నవ్వగా’.. ఈ పాట వింటే తెలుగు సినీ ప్రియులందరికీ పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌, నటి భూమిక నటించిన ‘ఖుషి’ గుర్తుకువస్తుంది. ఫీల్‌గుడ్‌ ప్రేమకథతో తెరకెక్కిన ఈ సినిమా పవన్‌ కల్యాణ్‌ కెరీర్‌లో ఓ బ్లాక్‌బస్టర్‌. సిద్ధూగా పవన్‌, మధుమతిగా భూమిక ఆన్‌స్క్రీన్‌ కెమిస్ట్రీ అందర్నీ కట్టిపడేసింది. కాగా, సుమారు 21 సంవత్సరాల తర్వాత ‘ఖుషి’ మ్యాజిక్‌ని భూమిక రీక్రియేట్‌ చేసి నెటిజన్ల మది దోచేశారు.

సహాయనటిగా పలు సినిమాల్లో నటిస్తున్న భూమిక తాజాగా తన స్నేహితురాలు, డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ సవితా రాధాకృష్ణన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వీళ్లిద్దరూ ‘ఖుషి’ రోజుల్ని గుర్తు చేసుకున్నారు. ‘ఖుషి’లోని ‘అమ్మాయే సన్నగా’ పాటకు స్టెప్పులేశారు. దీనికి సంబంధించిన వీడియోని ‘ఖుషి విత్‌ ‘ఖుషి’’ పేరుతో షేర్‌ చేస్తూ.. ‘‘ఖుషి.. రీక్రియేటింగ్‌.. స్నేహితురాలు, నా డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ సవితా రాధాకృష్ణన్‌తో కలిసి 21 ఏళ్ల తర్వాత ‘ఖుషి’ మ్యాజిక్‌ను రీక్రియేట్‌ చేసే ప్రయత్నం చేశా. ఆనాటి నుంచి ఈనాటి వరకూ మీరు నాపై చూపిస్తున్న ప్రేమాభిమానాలకు ధన్యవాదాలు’’ అని భూమిక రాసుకొచ్చారు. ప్రస్తుతం ఈవీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్లు.. ‘‘మేజికల్‌ సాంగ్‌’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని