Bhuvana Vijayam: ఆసక్తిని పెంచుతున్న ‘భువన విజయమ్‌’ టీజర్‌

సునీల్‌ (Sunil) హీరోగా తెరకెక్కుతోన్న సినిమా  ‘భువన విజయమ్‌’ (Bhuvana Vijayam). తాజాగా ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేశారు.

Published : 14 Mar 2023 15:01 IST

హైదరాబాద్‌: సునీల్‌ (Sunil), శ్రీనివాస్‌ రెడ్డి, వెన్నెల కిశోర్‌, ధనరాజ్‌ ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం ‘భువన విజయమ్‌’ (Bhuvana Vijayam). ఈ సినిమాతో యలమంద చరణ్‌ దర్శకుడుగా పరిచయం కానున్నారు. టైటిల్‌తోనే అందరి దృష్టిని ఆకర్షించిన ఈ చిత్ర టీజర్‌ను డైరెక్టర్‌ మారుతి లాంచ్‌ చేశారు. కథలోని పాత్రలను పరిచయం చేస్తూ సాగిన ఈ టీజర్‌ నెటిజన్లను ఆకట్టుకుంటుంది. ‘ఒక కథానాయకుడు.. అతని కథేంటో అతనికే తెలీదు. ఒక ప్రొడ్యూసర్‌.. అతనికి జాతకాల పిచ్చి. ఒకరంటే ఒకరికి పడని ఎనిమిది మంది రచయితలు. అనుకోకుండా రైటర్‌గా మారిన ఓ దొంగ.. వీళ్ల మధ్యలో తిరుగుతున్న ఆత్మ..’ అనే వాయిస్‌ ఓవర్‌తో ఉన్న ఈ టీజర్‌లో నటీనటులు వారి టైమింగ్‌తో ఆకట్టుకున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు