Bichagadu 2: సెకండాఫ్‌తో ప్రారంభమైన ‘బిచ్చగాడు 2’.. సినిమా పూర్తయ్యాక ట్విస్ట్!
స్వీయ దర్శకత్వంలో కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన చిత్రం ‘బిచ్చగాడు 2’. ఈ సినిమా ప్రదర్శన విషయంలో హైదరాబాద్‌లోని ఓ మల్టీప్లెక్స్‌లో తప్పిదం జరిగింది.
ఇంటర్నెట్ డెస్క్: సినిమాల ప్రదర్శనలో కొన్నిసార్లు పొరపాట్లు జరుగుతుంటాయనే సంగతి తెలిసిందే. ఓ చిత్రానికి బదులు మరో చిత్రం ప్రదర్శితమవడం, కొత్త సినిమా స్థానంలో పాత సినిమా ప్లే అవడం అప్పుడప్పుడు చూస్తుంటాం. వీటికి విభిన్నమైన ఘటన హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ మల్టీప్లెక్స్‌లో చోటుచేసుకుంది. ‘బిచ్చగాడు 2’ (Bichagadu 2) సినిమా చూసేందుకు అక్కడకు వెళ్లిన ప్రేక్షకులకు ఊహించని చిత్రం ఎదురైంది. ఎక్కడ తప్పిదం జరిగిందో తెలియదుగానీ సదరు మల్టీప్లెక్స్ సిబ్బంది చేసిన పనికి ఆడియన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. యాజమాన్యాన్ని నిలదీశారు. సంబంధిత వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఏం జరిగిందంటే?
స్వీయ దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు విజయ్ ఆంటోనీ (Vijay Antony) హీరోగా నటించిన చిత్రం ‘బిచ్చగాడు 2’.. ఈ నెల 19న విడుదలైంది. ఆదివారం.. ఆ మల్టీప్లెక్స్‌లో ఈ సినిమా మార్నింగ్ షోని సెకండాఫ్‌తో ప్రారంభించారు. ప్రేక్షకులు కథలో లీనమవడంతో అది ద్వితీయార్థం అని వారు గమనించలేకపోయారు. చివరల్లో వచ్చే క్రెడిట్స్ టైటిల్స్ చూసి అసలు విషయం గుర్తించారు. సగ భాగంతోనే సినిమాని పూర్తిచేశారంటూ యాజమాన్యంతో వాగ్వాదానికి దిగారు. టికెట్ డబ్బులు రిఫండ్ చేయమని కోరారు. ఈ సినిమా విషయంలో సెకండాఫ్ కొత్త కథలా అనిపిస్తుందని, అందుకే వారు దాన్నే ఫస్టాఫ్ అనుకుని ఉండొచ్చని పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
గతంలో వచ్చిన సూపర్‌హిట్ చిత్రం ‘బిచ్చగాడు’కు ఇది సీక్వెల్ కాకపోయినా అందులోని పలు అంశాలు ‘బిచ్చగాడు 2’లో ఉంటాయి. ఇది అన్నా చెల్లెళ్ల అనుబంధం నేపథ్యంలో రూపొందింది. బ్రెయిన్ ట్రాన్స్‌ప్లాంటేషన్ కాన్సెప్ట్‌ని ప్రస్తావించారు. కావ్యా థాపర్ కథానాయిక.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Rajasthan : ఉప రాష్ట్రపతి తరచూ రాజస్థాన్‌కు ఎందుకొస్తున్నారు.. మీ పర్మిషన్ కావాలా?
-
Crime news మధ్యప్రదేశ్ అత్యాచార ఘటన.. కస్టడీ నుంచి పారిపోయేందుకు నిందితుడి యత్నం!
-
Janasena: తెదేపాతో కలిసి సమస్యలపై పోరాడాలి: నాదెండ్ల మనోహర్
-
Social Look: నజ్రియా వెకేషన్.. నయన్ సెలబ్రేషన్స్..!
-
Top Ten News @ 9 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Team India: కప్పు ముందు కనువిప్పు.. టీమ్ఇండియాకు ఓటమి నేర్పే పాఠాలెన్నో