Bichagadu 2 review: రివ్యూ: బిచ్చగాడు-2
Bichagadu 2 review: విజయ్ ఆంటోనీ కీలక పాత్రలో నటించిన ‘బిచ్చగాడు2’ ఎలా ఉందంటే?
Bichagadu 2 review: చిత్రం: బిచ్చగాడు2; నటీనటులు: విజయ్ ఆంటోనీ, కావ్యథాపర్, రాధారవి, వైజీ మహేంద్రన్, మన్సూర్ అలీఖాన్, హరీశ్ తదితరులు; సంగీతం: విజయ్ ఆంటోనీ; సినిమాటోగ్రఫీ: ఓం నారాయణ్; ఎడిటింగ్: విజయ్ ఆంటోనీ; నిర్మాత: ఫాతిమా విజయ్ ఆంటోనీ; బ్యానర్: విజయ్ ఆంటోనీ ఫిల్మ్కార్పొరేషన్; దర్శకత్వం: విజయ్ ఆంటోనీ; విడుదల: 19-05-2023
‘నకిలీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల పరిచయమై ‘సలీమ్’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విజయ్ ఆంటోనీ. ఆ తర్వాత ఆయన నటించిన ‘బిచ్చగాడు’ తెలుగులో ఘన విజయం సాధించింది. అప్పటి నుంచి విజయ్ నటించిన ప్రతి తమిళ చిత్రం తెలుగులో విడుదలవుతూనే ఉంది. అయితే, ‘బిచ్చగాడు’ స్థాయి విజయాన్ని ఆయన అందుకోలేకపోయారు. ఈ క్రమంలోనే ‘బిచ్చగాడు2’ అంటూ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. (bichagadu 2 review) మరి ఇంతకీ ఈ బిచ్చగాడి కథేంటి? విజయ్ ఆంటోనీ ఎలా నటించారు?
కథేంటంటే: వి.జి.గ్రూప్ వ్యాపార సంస్థలకు అధిపతి విజయ్ గురుమూర్తి (విజయ్ ఆంటోని). దేశంలోనే 7వ అత్యంత ధనవంతుడు. అతని ఆస్తి కొట్టేయాలని స్నేహితుడు అరవింద్ (దేవ్ గిల్) అదే సంస్థలో పని చేస్తున్న మరికొందరు మిత్రులతో కలిసి కుట్ర పన్నుతాడు. అందుకోసం విజయ్ మెదడు మార్పిడి ప్రయోగం చేయాలని నిర్ణయించుకుంటాడు. రూ.140కోట్లు ఖర్చు చేసి సత్య (విజయ్ ఆంటోని) అనే బిచ్చగాడి మెదడును గురుమూర్తి తలలో అమర్చుతాడు. అయితే సత్యది మరో కథ. అతనికి రాణి అనే చెల్లి ఉంటుంది. చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోతే ఆదుకునే వాళ్లు లేక రోడ్డున పడతాడు. అదే సమయంలో ఓ వ్యక్తి చేసిన మోసం వల్ల తన చెల్లి తప్పిపోతుంది. ఆమె కోసం వెతుకున్న సమయంలోనే అనుకోకుండా అరవింద్ కుట్రకు బలైపోతాడు. మరి సత్య మెదడు విజయ్ గురుమూర్తికి అమర్చాక ఏం జరిగింది? అతనిని అడ్డం పెట్టుకొని విజయ్ ఆస్తి దక్కించుకోవాలనుకున్న అరవింద్‌కు సత్య ఎలా బుద్ధి చెప్పాడు? (bichagadu 2 review) తప్పిపోయిన తన చెల్లిని కనిపెట్టేందుకు ఏం చేశాడు? ఈ క్రమంలో అతనికి ఎదురైన సవాళ్లేంటి? పేద ప్రజల కోసం మొదలు పెట్టిన యాంటీ బికిలీ మాల్ ఏమైంది? దాని విషయంలో ఎదురైన రాజకీయ సవాళ్లను ఎలా అధిగమించాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే!
ఎలా సాగిందంటే: ఇది ‘బిచ్చగాడు’కు కొనసాగింపు చిత్రమే అయినా ఆ కథకూ ఈ కథకు ఎక్కడా పోలిక ఉండదు. తొలి భాగం పూర్తిగా అమ్మ సెంటిమెంట్ నేపథ్యంలో సాగితే.. ఈ చిత్రం చెల్లి సెంటిమెంట్ చుట్టూ తిరుగుతుంది. అయితే మొదటి భాగంతో పోలిస్తే ఇందులో కథ పరంగా అనేక లోపాలు కనిపిస్తాయి. అలాగే చెల్లి సెంటిమెంట్‌ను అంత ప్రభావవంతంగా హత్తుకునేలా చూపించలేకపోయారు. ప్రధమార్ధంలో వచ్చే మెదడు మార్పిడి కాన్సెప్ట్‌ను చూసినప్పుడు తెలుగులో వచ్చిన ‘ఇస్మార్ట్ శంకర్’ గుర్తొస్తుంది. నిజానికి ఇందులో గురుమూర్తి ఆస్తి కాజేయడానికి అతని స్థానంలోకి అలాగే ఉన్న మరో వ్యక్తిని తీసుకొచ్చినా సరిపోతుంది. (bichagadu 2 review) ఎలాగూ ఈ కథలో హీరో పాత్రలు దాదాపు ఒకే పోలికలతో కనిపిస్తాయి. కానీ, మెదడు మార్పిడి అనే పాయింట్‌ను తీసుకొచ్చి కథకు కొత్తదనం అద్దాలని ప్రయత్నించారు. సినిమా ఆరంభంలో వచ్చే ఈ బ్రెయిన్ ట్రాన్‌ప్లాంటేషన్ సన్నివేశాలు ఆసక్తికరంగానే ఉంటాయి. కానీ, దాని వల్ల కథకు అదనంగా చేకూరిన ప్రయోజనం ఏమీ కనిపించదు. విజయ్ గురుమూర్తి గతంలో పెద్దగా డెప్త్ కనిపించదు. ‘‘చెల్లి వినవే’’ పాటతో సత్య పాత్ర గతాన్ని పరిచయం చేసిన తీరు బాగుంది. ముఖ్యంగా ఆ పాటలో సత్య తన చెల్లి రాణితో కలిసి ఎదుర్కొన్న కష్టాలను హృదయానికి హత్తుకునేలా చూపించారు. సత్య మెదడుతో విజయ్ గురుమూర్తి బయట ప్రపంచంలోకి అడుగు పెట్టినప్పటి నుంచి కథ వేగం పుంజుకుంటుంది. అరవింద్‌ను.. అతని గ్యాంగ్‌ను సత్య చంపడంతో ప్రథమార్ధానికి విరామమిచ్చిన తీరు ఆకట్టుకుంది. ఈ క్రమంలో వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ప్రేక్షకులకు మంచి హై ఇస్తుంది.
అయితే ప్రథమార్ధం వరకు మంచి స్క్రీన్‌ప్లేతో ఆసక్తికరంగా సాగిన కథ.. ద్వితీయార్ధంలో కాస్త గాడి తప్పింది. సామాజిక సేవ విషయమై హీరో పదే పదే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వడం విసుగు పుట్టిస్తుంది. ఓవైపు తనకు బోలెడంత డబ్బు, పరపతి ఉన్నా చెల్లిని వెతికేందుకు సత్య మళ్లీ బిచ్చగాడి వేషం కట్టడం సిల్లీగా అనిపిస్తుంది. (bichagadu 2 review) పేద ప్రజలకు సహాయం చేయాలని అతను ‘యాంటి బికిలీ’ అనే మాల్‌ను ప్రారంభించడం.. దాని గురించి ఓ భారీ సభ పెట్టి సుదీర్ఘ ఉపన్యాసం ఇవ్వడం.. ఈ సీక్వెన్స్ అంతా అసలు కథను పూర్తిగా పక్కదోవ పట్టించినట్లు తోస్తుంది. సత్యకు ఎప్పుడైతే రాజకీయ సవాళ్లు ఎదురవుతాయో అప్పుడు మళ్లీ కథ కాస్త రసవత్తరంగా మారుతుంది. సత్యను బెదిరించేందుకు ముఖ్యమంత్రి ఓ రౌడీ మూకను పంపడం.. వాళ్లను అతను చితక్కొటి కౌంటరివ్వడం.. ఆ యాక్షన్ సీక్వెన్స్ అంతా ఆకట్టుకునేలా ఉంటుంది. క్లైమాక్స్‌కు ముందు వచ్చే కోర్టు రూం డ్రామా మరీ సినిమాటిక్‌గా అనిపిస్తుంది. పతాక సన్నివేశాలు భావోద్వేగభరితంగా సాగుతాయి. ఆ ముగింపు ప్రేక్షకుల మదిని బరువెక్కిస్తుంది.
ఎవరెలా చేశారంటే: నటుడిగా విజయ్ ఆంటోని (vijay antony) ప్రతిభ గురించి కొత్తగా మాట్లాడుకునే పనిలేదు. నటన పరంగా తన పాత్రను అవలీలగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. ముఖ్యంగా పతాక సన్నివేేశాల్లో భావోద్వేగభరితమైన నటనతో కంటతడి పెట్టిస్తాడు. ఇక దర్శకుడిగా ఇది ఆయనకు తొలి చిత్రమే అయినా ఆ ప్రభావం తెరపై ఎక్కడా కనిపించదు. మంచి అనుభవమున్న దర్శకుడిలా తెరపై ప్రతిభ చూపించాడు. రాసుకున్న కథలో చాలా లోపాలున్నా.. మాస్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ మూమెంట్స్ వాటిని మర్చిపోయేలా చేస్తాయి. ద్వితీయార్ధాన్ని మరింత పగడ్బందీగా తీర్చిదిద్దుకొని ఉంటే సినిమా మరోస్థాయిలో ఉండేది. సంగీత పరంగానూ ఈ చిత్రానికి విజయ్ తన వంతు న్యాయం చేశారు. (bichagadu 2 review) చాలా సన్నివేశాల్లో తన నేపథ్య సంగీతంతో హీరోయిజాన్ని ఆకట్టుకునేలా ఎలివేట్ చేయగలిగారు. పాటలు మాత్రం పూర్తిగా తేలిపోయాయి. ఏ ఒక్కటీ గుర్తుంచుకునేలా ఉండదు. కావ్య థాపర్ అందంగా కనిపించింది. నటన పరంగా ఆమెకు కొత్తగా చూపించే ఆస్కారం ఏమీ దొరకలేదు. దేవ్ గిల్, రాధా రవి, జాన్ విజయ్, హరీష్ పేరడి తదితరుల పాత్రలు పరిధి మేరకు ఉన్నాయి. యోగిబాబు కామెడీ సరిగా పండలేదు. ఛాయాగ్రహణం చిత్రానికి అదనపు ఆకర్షణ తీసుకొచ్చింది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి.
- బలాలు
- + విజయ్ నటన
- + యాక్షన్, ఎమోషన్స్
- + పతాక సన్నివేశాలు
- బలహీనతలు
- - కథనం సాగిన తీరు
- - ద్వితీయార్ధం
- చివరిగా: మాస్ ప్రేక్షకులు మెచ్చే ‘బిచ్చగాడు’ (bichagadu 2 review)
- గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్‌లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
Om Bhim Bush Review; రివ్యూ: ఓం భీమ్ బుష్.. కామెడీ ఎంటర్టైనర్ అలరించిందా?
om bhim bush review: శ్రీ విష్ణు, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రల్లో నటించిన ‘ఓం భీమ్ బుష్’ ఎలా ఉందంటే? -
ThulasiVanam Review: రివ్యూ: తులసీవనం: మిడిల్‌క్లాస్ కుర్రాడి బయోపిక్
ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ‘తులసీవనం’ వెబ్‌సిరీస్ ఎలా ఉందంటే? -
Abraham Ozler review: రివ్యూ: అబ్రహాం ఓజ్లర్.. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ఎలా ఉంది?
Abraham Ozler review: జయరామ్, మమ్ముట్టి కీలక పాత్రల్లో నటించిన ‘అబ్రహాం ఓజ్లర్’ ఎలా ఉందంటే? -
Save The Tigers 2 Review: రివ్యూ: సేవ్ ది టైగర్స్ సీజన్ 2.. నవ్వులు రిపీట్ అయ్యాయా?
ప్రియదర్శి, అభినవ్ గోమఠం, చైతన్య కృష్ణ ప్రధాన పాత్రల్లో నటించిన వెబ్‌సిరీస్ ‘సేవ్ ది టైగర్స్ 2’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో విడుదలైన ఈ సిరీస్ ఎలా ఉందంటే? -
Sharathulu Varthisthai Review: రివ్యూ: షరతులు వర్తిస్తాయి.. సినిమా ఎలా ఉందంటే?
Sharathulu Varthisthai Review: చైతన్యరావు కీలక పాత్రలో నటించిన ‘షరతులు వర్తిస్తాయి’ మూవీ మెప్పించిందా? -
Yodha Review: రివ్యూ: యోధ.. యాక్షన్ థ్రిల్లర్ మెప్పించిందా?
సిద్ధార్థ్ మల్హోత్రా, రాశీఖన్నా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకులను అలరించిందా..? -
Razakar Movie Review: రివ్యూ: రజాకార్.. బాబీ సింహా, అనసూయ నటించిన మూవీ ఎలా ఉంది?
Razakar Movie Review: తెలంగాణ సాయుధ పోరాటం నేపథ్యంలో రూపొందిన ‘రజాకార్’ ఎలా ఉందంటే? -
Merry Christmas review: రివ్యూ: మెర్రీ క్రిస్మస్.. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ నటించిన చిత్రం ఎలా ఉందంటే?
విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘మెర్రీ క్రిస్మస్’. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. ఎలా ఉందంటే? -
Anweshippin Kandethum Review: రివ్యూ: అన్వేషిప్పిన్ కండెతుమ్.. మలయాళ బ్లాక్‌బస్టర్ ఎలా ఉంది?
Anweshippin Kandethum Review: టొవినో థామస్ కీలకపాత్రలో నటించిన పోలీస్ ప్రొసీడల్ డ్రామా మెప్పించిందా? -
Shaitaan Movie Review: రివ్యూ: షైతాన్.. మాధవన్ నెగెటివ్ షేడ్స్‌లో నటించిన మూవీ మెప్పించిందా?
Shaitaan Movie Review: అజయ్ దేవ్‌గణ్, జ్యోతిక, మాధవన్ కీలక పాత్రల్లో నటించిన మూవీ ఎలా ఉంది? -
Breathe Review: రివ్యూ: బ్రీత్.. నందమూరి చైతన్య కృష్ణ హీరోగా నటించిన సినిమా ఎలా ఉందంటే?
Breathe telugu movie Review: నందమూరి చైతన్య కృష్ణ హీరోగా పరిచయమైన సినిమా ‘బ్రీత్’. వైద్యో నారాయణో హరి అనేది ఉపశీర్షిక. ఓటీటీ ‘ఆహా’లో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ చిత్రం ఎలా ఉందంటే? -
Bhimaa movie review: రివ్యూ: భీమా.. గోపిచంద్ ఖాతాలో హిట్ పడిందా?
Bhimaa movie review: యాక్షన్ హీరోగా పేరుతెచ్చుకున్న గోపిచంద్ కీలక పాత్రలో నటించిన ‘భీమా’ మూవీ మెప్పించిందా? -
Gaami review: విశ్వక్సేన్ నటించిన ‘గామి’ ఎలా ఉందంటే..!
అఘోరాగా విశ్వక్సేన్ నటించిన చిత్రం ‘గామి’. మరి ఈ పాత్రలో విశ్వక్ భయపెట్టాడో.. లేదో తెలుసుకుందాం. -
Premalu Movie Review: రివ్యూ: ప్రేమలు.. మలయాళ బ్లాక్‌బస్టర్ తెలుగులో ఎలా ఉంది?
Premalu Movie Review: మలయాళంలో ఘన విజయం సాధించిన ‘ప్రేమలు’ తెలుగులోనూ అదే పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిందా? -
Valari Review: రివ్యూ: వళరి.. రితికా సింగ్ నటించిన హారర్ మూవీ ఎలా ఉందంటే?
Valari Review: రితికా సింగ్ నటించిన హారర్ చిత్రం ‘వళరి’. నేరుగా ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్’లో విడుదలైన ఈ సినిమా ఎలా ఉందంటే? -
The Indrani Mukerjea Story: రివ్యూ: ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’.. షీనా బోరా హత్య కేసుపై డాక్యుమెంటరీ
షీనా బోరా హత్య కేసుపై రూపొందిన డాక్యుమెంటరీ సిరీస్ ‘ది ఇంద్రాణీ ముఖర్జియా స్టోరీ’. ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ అవుతోంది. -
Bhoothaddam Bhaskar Narayana Review: రివ్యూ: భూతద్దం భాస్కర్ నారాయణ.. థ్రిల్ పంచాడా?
Bhoothaddam Bhaskar Narayana Review: శివ కందుకూరి కీలక పాత్రలో నటించిన మిస్టరీ థ్రిల్లర్ ‘భూతద్దం భాస్కర్ నారాయణ’ ఎలా ఉంది? ప్రేక్షకులకు థ్రిల్ పంచిందా? -
Operation Valentine Review: రివ్యూ: ఆపరేషన్ వాలెంటైన్.. వరుణ్ ఖాతాలో హిట్ పడిందా?
Operation Valentine Review in telugu: పుల్వామా ఉగ్రదాడి నేపథ్యంలో వరుణ్ తేజ్ కీలక పాత్రలో శక్తి ప్రతాప్ సింగ్ దర్శకత్వం వహించిన ‘ఆపరేషన్ వాలెంటైన్’ మెప్పించిందా? -
Malaikottai Vaaliban: రివ్యూ: మలైకోటై వాలిబన్.. మోహన్‌లాల్ నటించిన పీరియాడికల్ చిత్రం ఎలా ఉందంటే?
మలయాళ నటుడు మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం ‘మలైకోటై వాలిబన్’. ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఎలా ఉందంటే? -
siddharth roy movie review: రివ్యూ: సిద్ధార్థ్ రాయ్.. దీపక్ సరోజ్ నటించిన మూవీ ఎలా ఉంది?
siddharth roy movie review: ప్రచార చిత్రాలతో ఆసక్తిని పెంచిన ‘సిద్ధార్థ్ రాయ్’ ప్రేక్షకులను మెప్పించిందా? లేదా?
తాజా వార్తలు (Latest News)
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్‌కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య
-
ఎన్నికల మేనిఫెస్టోను ఏప్రిల్ 6న విడుదల చేయనున్న కాంగ్రెస్
-
బెంగళూరు కేఫ్ పేలుడు ఘటన.. కీలక కుట్రదారు అరెస్ట్!