Tamannaah: ఆ సినిమా కోసం తమన్నా భారీ పారితోషికం?

ఒకవైపు కథానాయికగా నటిస్తూనే, అప్పుడప్పుడు ఐటమ్‌ సాంగ్స్‌తో అలరిస్తున్న భామ తమన్నా. ప్రస్తుతం

Published : 02 Nov 2021 17:03 IST

హైదరాబాద్‌: ఒకవైపు కథానాయికగా నటిస్తూనే, అప్పుడప్పుడు ఐటమ్‌ సాంగ్స్‌తో అలరిస్తున్న భామ తమన్నా. ప్రస్తుతం చిరంజీవి, వెంకటేశ్‌, నాగార్జున తదితర అగ్ర కథానాయకుల సరసన నటించే హీరోయిన్స్‌ జాబితాలో తమన్నా పేరు అందరి కంటే ముందుంటుంది. వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్న ‘ఎఫ్‌3’లో మెహ్రీన్‌తో పాటు, తమన్నా హీరోయిన్‌గా చేస్తోంది. కాగా, ఇప్పుడు చిరంజీవి జోడీగా ఆమె ఎంపిక దాదాపు ఖరారైంది. మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో చిరు నటిస్తున్న తాజా చిత్రం ‘భోళా శంకర్’. కీర్తిసురేశ్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమాలో కథానాయిక కోసం తమన్నాను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ఇందులో నటించినందుకు గానూ ఆమె కెరీర్‌లో భారీ పారితోషికం అందుకుంటున్నారని టాలీవుడ్‌ టాక్‌. ‘భోళా శంకర్‌’ కోసం ఆమె దాదాపు రూ.3కోట్లు అందుకోనున్నారట. అంతేకాదు, సగం మొత్తం అడ్వాన్స్‌గా తీసుకున్నారని సమాచారం. ఇది నిజమో కాదో తెలియాలంటే తమన్నానే స్పందించాల్సి ఉంది. ఇక చిరు-తమన్నా కలిసి ‘సైరా’లో నటించారు. తెరపై వీరి జోడికి మంచి మార్కులే పడ్డాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని