RRR: ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నుంచి బిగ్‌ అప్‌డేట్‌.. సినిమా విడుదల ఎప్పుడంటే?

ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ కలిసి నటించిన చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. జనవరి 7 విడుదల కావాల్సిన చిత్రం కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఆ చిత్రం విడుదలపై చిత్రబృందం అప్‌డేట్‌ ఇచ్చింది. కరోనా పరిస్థితి సద్దుమణిగితే మార్చి 18న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను

Updated : 21 Jan 2022 19:29 IST

హైదరాబాద్‌: భారతీయ సినీ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. ఎస్‌.ఎస్‌. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌-రామ్‌చరణ్‌ కలిసి నటించారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 7న పాన్‌ ఇండియాగా విడుదల కావాల్సిన చిత్రం కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా ఈ సినిమా విడుదలపై చిత్రబృందం బిగ్‌ అప్‌డేట్‌ ఇచ్చింది. కరోనా పరిస్థితులు సద్దుమణిగితే ఈ ఏడాది మార్చి 18న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ను విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఆ రోజున కుదరని పక్షంలో ఏప్రిల్‌ 28న విడుదల చేస్తామని వెల్లడించింది. చిత్రబృందం తాజా ప్రకటనతో ఎన్టీఆర్‌, మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.  

స్వాతంత్ర్య పోరాట కాలంలో విప్లవ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమురం భీమ్‌లు కలుసుకుంటే ఎలా ఉంటుంది?ఏ విధంగా బ్రిటిష్ వారిపై పోరాటం చేశారనే ఫిక్షనల్‌ కథతో ‘ఆర్ఆర్‌ఆర్‌’ను తెరకెక్కించారు దర్శకుడు రాజమౌళి. రూ.400కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో అజయ్‌ దేవ్‌గణ్‌, అలియా భట్‌, ఓలివియా మోరిస్‌, సముద్రఖని, అలీసన్‌ డూడీ రే స్టీవెన్‌సన్‌, శ్రియ తదితరులు కీలక పాత్రలు పోషించారు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ‘ఆర్‌ఆర్‌ఆర్‌’కు కీరవాణి మ్యూజిక్‌ డైరెక్టర్‌. తెలుగు, తమిళ, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని