Bigg Boss Telugu 7: ఇంత త్వరగా బయటకు వచ్చేస్తానని అనుకోలేదు.. కన్నీటి పర్యంతమైన షకీలా
బిగ్‌బాస్ సీజన్-7 నుంచి సినీ నటి షకీలా (Shakeela) ఎలిమినేట్ అయ్యారు. చివరి వరకూ నామినేషన్స్‌లో టేస్టీ తేజ, షకీలా ఉండగా, చివరికి మాయాద్వీపం నుంచి టేస్టీ తేజ ఫొటో రావడంతో అతడు సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు.
హైదరాబాద్: బిగ్‌బాస్ సీజన్-7 నుంచి సినీ నటి షకీలా (Shakeela) ఎలిమినేట్ అయ్యారు. రెండో వారం నామినేషన్స్‌లో శివాజీ, పల్లవి ప్రశాంత్, షకీలా, టేస్టీ తేజ, గౌతమ్ కృష్ణ, శోభ, అమర్‌దీప్, రతికా రోజ్‌లు ఉండగా, మాయాస్త్రను సాధించిన శివాజీ సేఫ్ అయ్యారు. ఆదివారం జరిగిన ఎపిసోడ్‌లో చివరి వరకూ నామినేషన్స్‌లో టేస్టీ తేజ, షకీలా ఉండగా, చివరికి మాయాద్వీపం నుంచి టేస్టీ తేజ ఫొటో రావడంతో అతడు సేఫ్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. షకీలా ఎలిమినేట్ అనగానే, హౌస్‌మేట్స్ అందరూ భావోద్వేగానికి గురయ్యారు. అయితే, తానేమీ బాధపడటం లేదని చెబుతూ షకీలా ఇంటి నుంచి బయటకు వచ్చారు.
అనంతరం వేదికపైకి వచ్చి నాగార్జునతో మాట్లాడుతూ.. ‘ఇంత త్వరగా హౌస్ నుంచి బయటకు వచ్చేస్తానని అనుకోలేదు’ అని అన్నారు. ఈ క్రమంలో హౌస్‌మేట్స్‌లో ఎవరెవరు ఎలాంటి వారో చెప్పమని రెయిన్‌బో కలర్స్‌ను ఇవ్వగా షకీలా ఆ వ్యక్తి ఫొటోపై పెయింట్ వేస్తూ, వాళ్ల మనస్తత్వాన్ని చెప్పారు. ‘‘ప్రియాంక.. అందరితోనూ ఫ్రెండ్లీగా ఉంటుంది. ప్రిన్స్ యావర్.. ఎప్పుడూ తానే గొప్పవాడు అనుకుంటాడు. పల్లవి ప్రశాంత్.. ఆవేశ పరుడు. ఎవరి మాట వినడు. తొందర పడిపోతాడు. దామిని.. నమ్మకస్తురాలు. రతికా రోజ్.. హృదయం బండరాయిలాంటిది. శివాజీ.. ఇంట్లో వాళ్లందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు’ అంటూ షకీలా హౌస్‌మేట్స్‌కు కితాబిచ్చారు. అనంతరం హౌస్‌లో తనకు రావాల్సిన మెడాలియన్‌ను సుత్తితో పగలగొట్టారు.
ఈ సందర్భంగా టేస్టీ తేజ మాట్లాడుతూ.. కొందరికి తమ ఇంటి సభ్యులు గుర్తుకు వచ్చి, బాధపడ్డారని, తనకు మాత్రం షకీలామ్మ ఉండటం వల్ల ఆ బాధ తెలియలేదని అన్నాడు. అనంతరం ఇంట్లోని వాళ్లందరూ షకీలాకు వీడ్కోలు చెప్పగా, దామిని ‘పెదవే పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా’ పాట పాడి షకీలాకు వీడ్కోలు పలికారు. ఆ పాట విన్న షకీలా కన్నీటి పర్యంతమయ్యారు. చివరిగా హౌస్‌మేట్స్ అందరూ తమకు కేటాయించిన బెడ్‌రూమ్స్‌లోనే పడుకోవాలని నాగార్జున సూచించి, ఈ వారానికి గుడ్ బై చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Mexico: మెక్సికోలో ట్రక్కు బోల్తా: 10 మంది వలసవాదులు మృతి
-
Today Horoscope in Telugu: నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/10/23)
-
Rathika Rose: రతికా రోజ్ ఎలిమినేట్.. బద్దలైన యువ హృదయాలు..
-
Siddu Jonnalagadda: ఆ దర్శకుడికి రావాల్సినంత గుర్తింపు రాలేదనిపించింది: సిద్ధు జొన్నలగడ్డ
-
interesting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
ముగిసిన ప్రపంచ సాంస్కృతిక ఉత్సవాలు.. కనువిందుగా కళాకారుల ప్రదర్శనలు