Inaya-Sohel: ప్రాణం ఉన్నంత వరకూ సోహైల్‌ను ప్రేమిస్తూనే ఉంటా..
బిగ్‌బాస్ షో ద్వారా పాపులర్ అయిన సోహైల్(Sohel)కు తాజాగా అదే కార్యక్రమంలో కంటెస్టెంట్‌గా గుర్తింపు పొందిన ఇనయ(Inaya) ప్రపోజ్ చేసింది. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.
హైదరాబాద్: సోహైల్(Sohel).. ఓ ప్రముఖ చానల్‌లో ప్రసారమయ్యే బిగ్‌బాస్ కార్యక్రమంలో కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఇనయ(Inaya) కూడా తాజాగా ఈ షో సీజన్6 ద్వారా అందరికీ సుపరిచతం అయింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్నప్పుడు సోహైల్ అంటే తనకు ఎంత ఇష్టమో సందర్భం వచ్చినప్పుడల్లా ఇనయ చెబుతూనే ఉంది. ఇక అతడు కూడా ఆమెకు సపోర్ట్ చేస్తూ బిగ్‌బాస్6 స్టేజ్‌పై సందడి చేసిన విషయమూ తెలిసిందే. అసలు విషయమేమిటంటే ఇటీవలే బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చిన ఇనయ.. సోహైల్‌కు ప్రపోజ్ చేసింది. ప్రస్తుతం ఆ వీడియో వైరల్ అవుతోంది.
‘నా మనసులోని మాట నీకు చెప్పాలనుకుంటున్నా సోహైల్. ప్రేమ ఉన్నంత వరకు కాదు.. ప్రాణం ఉన్నంత వరకూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటా. నాకు నువ్వంటే చాలా ఇష్టం’ అని ప్రపోజ్ చేసింది. అయితే దీనిపై సోహైల్ ఎలా స్పందించాడో తెలియాలంటే వేచి చూడండి అని పేర్కొంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇనయ ప్రేమను సోహైల్ ఓకే చేశాడా? లేదా? అన్నది త్వరలోనే తెలియనుంది. ఇక దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ‘మీరిద్దరూ బెస్ట్ జోడీ’ అంటూ కామెంట్ చేస్తున్నారు.
అటు బిగ్‌బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత సోహైల్ బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ హీరో నటించిన ‘లక్కీ లక్ష్మణ్’ సినిమా డిసెంబర్ 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. సోహైల్ సరసన మోక్ష నటించిన ఈ సినిమాను ఎ.ఆర్.అభి తెరకెక్కించారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రంలోని పాటలు యూత్‌ను ఆకట్టుకుంటున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Chandrababu: చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
-
Top Ten News @ 5 PM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Law Commission: 2024లో జమిలి ఎన్నికలు సాధ్యమేనా..? కొత్త ఫార్ములా రూపొందిస్తున్న లా కమిషన్!
-
Giant wheel: వామ్మో.. సరదాగా జెయింట్ వీల్ ఎక్కితే నరకం కనిపించింది!
-
Japan : మరోసారి పసిఫిక్ మహా సముద్రంలోకి అణుజలాలు విడుదల.. ప్రకటించిన జపాన్
-
Prithviraj Sukumaran: రోజుకు 9 గంటలు ఫిజియోథెరపీ.. హెల్త్ అప్డేట్పై హీరో పోస్ట్