Corona effect: బిగ్‌బాస్‌-3 నిలిపివేత

వినోద రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే సినిమా చిత్రీకరణలు దాదాపు నిలిచిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పుడు టెలివిజన్‌ మీద కూడా కరోనా తన  ప్రభావం కనిపిస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్నందున ‘మలయాళ బిగ్‌బాస్‌’ 3వ సీజన్‌ ప్రసారాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు.

Published : 21 May 2021 01:04 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వినోద రంగంపై కరోనా తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఇప్పటికే సినిమా చిత్రీకరణలు దాదాపు నిలిచిపోయాయి. థియేటర్లు మూతపడ్డాయి. ఇప్పుడు టెలివిజన్‌ మీద కూడా కరోనా తన ప్రభావం కనిపిస్తోంది. కరోనా కేసులు పెరుగుతున్నందున మలయాళ బిగ్‌బాస్‌ 3వ సీజన్‌ తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ కార్యక్రమాన్ని తమిళనాడులో చిత్రీకరిస్తున్నారు. ఆ రాష్ట్రంలో లాక్‌డౌన్‌ అమలులో ఉంది. కరోనా అదుపులోకి రాకపోవడంతో తాజాగా రెండు వారాల పాటు లాక్‌డౌన్‌ను పొడిగించారు. ఈ క్రమంలోనే తమిళనాడు పోలీసులతో పాటు ఆరోగ్యశాఖ అధికారులు ఈవీఎం ఫిల్మ్‌ సిటీలో వేసిన బిగ్‌బాస్‌ సెట్‌కు వెళ్లారట. వాళ్ల సూచనల మేరకు చిత్రీకరణ నిలిపివేసి అక్కడ ఉన్న కంటెస్టెంట్‌లను ఒక హోటల్‌కు తరలించినట్లు సమాచారం.

మలయాళంలో బిగ్‌బాస్‌ కార్యక్రమానికి ప్రముఖ హీరో మోహన్‌లాల్‌ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సీజన్‌ 14 మంది సభ్యులతో ఫిబ్రవరి 14న ప్రారంభమైంది. ప్రస్తుతం 8 మంది కార్యక్రమంలో కొనసాగుతున్నారు. ‘టికెట్‌ టు ఫైనల్‌’ జరుగుతున్న సమయంలో ఇలా కార్యక్రమాన్ని నిలిపివేయాల్సి రావడంతో అభిమానులు కాస్త నిరాశకు గురవుతున్నారు. కరోనా అదుపులోకి వచ్చిన వెంటనే అనుమతులు తీసుకొని త్వరలోనే కార్యక్రమాన్ని ప్రసారం చేస్తామని కార్యక్రమ నిర్వాహకులు చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని