
Bigg Boss telugu 5: బిగ్‌బాస్‌లో టాప్-6 ర్యాంకులు.. ఈ వారం నామినేట్ అయింది వీరే!
హైదరాబాద్: ప్రియాంక వెళ్లిపోయిన దానిపై హౌస్మేట్స్ మాట్లాడుకున్నారు. ఆమె వెళ్లిపోతుందని తాను ముందే అనుకున్నానని శ్రీరామ్ వద్ద కాజల్ చెప్పింది. ‘నువ్వు, మానస్‌లలో ఒకరు ఈ వారం వెళ్లిపోయే అవకాశం ఉందని కాజల్ అనుకుంటోంది. అందుకే నీతో ఎమోషనల్‌గా కనెక్ట్ అవుదామనుకుంటోంది. నువ్వు అవతలి వాళ్లతో ఆడాల్సిన పనిలేదు. అవతలి వాళ్లు నీతో ఆడకుండా ఉంటే చాలు. మనం జాగ్రత్తగా ఉండాలి.’అని సిరికి షణ్ముఖ్ హితబోధ చేశాడు. నామినేషన్స్ నుంచి సేవ్ అవడంతో సంతోషంగా ఉందంటూ షణ్నును హగ్ ఇవ్వమని సిరి కోరింది. ‘ఫ్రెండ్షిప్ హగ్’ అంటూ ఇద్దరూ మరోసారి ఆలింగనం చేసుకున్నారు.
ఆ తర్వాత గార్డెన్ ఏరియాలో ఒంటరిగా కూర్చొన్న షణ్ను ‘నేను చాలా బోరింగ్ పర్సన్. ఇన్నిరోజులు నన్ను ఎలా భరించారు. కొన్నిసార్లు నేను గేమ్ సరిగా ఆడలేదు. మొదటి రోజు నుంచి చాలాసార్లు మీరు(బిగ్‌బాస్) సపోర్ట్ చేశారు’ అంటూ తనలోతాను మాట్లాడుకున్నాడు. ఆ తర్వాత సిరితో కలిసి భోజనం చేస్తూ, ‘నీ క్యారెక్టర్ వరెస్ట్ అయినా కూడా పర్వాలేదు. వాళ్ల మాయలో పడొద్దు. మనద్దరినీ విడకొట్టాలని కాజల్, సన్నీ, మానస్ ప్రయత్నిస్తున్నారని, అందరినీ నమ్మడం బాగోలేదని, ఎప్పటికి మారతావంటూ సిరిపై షణ్ముఖ్ అసహనం వ్యక్తం చేశాడు. వాళ్లు చెప్పేది ప్రతిదీ నమ్మొద్దు’ అని మరోసారి సిరిపై మండిపడ్డాడు.
టాప్-6లో ఎవరెవరు?
హౌస్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఇప్పటికే శ్రీరామచంద్ర టికెట్ టు ఫినాలే గెలుచుకుని టాప్-5లో ఒకడిగా నిలిచాడు. ఇక హౌస్‌లో ఆరుగురు సభ్యులు ఉండగా, ఎవరు ఏ నంబర్లో ఉండాలన్న టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్(Bigg boss). ‘అసలు ఆట ఇప్పుడే మొదలవుతుంది. ఒకటి నుంచి ఆరు వరకూ మీ స్థానాలను నిర్ణయించుకుని అందుకు సంబంధించిన ర్యాంకుల వెనకాల నిలబడండి’ అని బిగ్‌బాస్ ఆదేశించాడు.
ఈ క్రమంలో సన్నీ మాట్లాడుతూ.. ‘ఇక్కడ ఫైట్ ఒకటో నంబర్ గురించే.. నేను వెళ్లి ఫస్ట్‌లో ఉంటా’ అని అనడం నవ్వులు పూయిస్తోంది. ఫస్ట్ నంబరు బోర్డును తన దగ్గర ఉంచుకుంటానంటూ హంగామా చేశాడు. ఆ తర్వాత కాజల్ ఒకటో నంబర్ బోర్డు వద్దకు వస్తే.. ‘అతిగా ఆశ పడే ఆడది.. అతిగా ఆవేశ పడే మగాడు సుఖపడినట్లు చరిత్రలో లేదు’ అంటూ సన్నీ పంచ్‌డైలాగ్‌లు కొట్టాడు. చివరిగా షణ్ముఖ్ మాట్లడుతూ.. ‘నేను అలా ఆడను. నిజమైన వ్యక్తి పేరు చెబుతా’ అని అంటే, ‘పర్ఫెక్ట్ అయితే ఫస్ట్ వచ్చి ఆడు’ అనడంతో ఎవరి స్థానంలో ఉండాలో షణ్ను తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఇంటి సభ్యుల అభిప్రాయం ప్రకారం టాప్-6 వీరే!
షణ్ముఖ్ ప్రకారం టాప్ 6: షణ్ముఖ్, సన్నీ, శ్రీరామ్, సిరి, మానస్, కాజల్
కాజల్ ప్రకారం టాప్6: కాజల్, సన్నీ, మానస్, శ్రీరామ్, సిరి, షణ్ముఖ్
మానస్ ప్రకారం టాప్-6: సన్నీ, కాజల్, షణ్ముఖ్, శ్రీరామ్, సిరి, మానస్
శ్రీరామ్ ప్రకారం టాప్-6: షణ్ముఖ్/సిరి, సన్నీ, మానస్, కాజల్
సన్నీ ప్రకారం టాప్-6: కాజల్, మానస్, సిరి, షణ్ముఖ్/శ్రీరామ్, సన్నీ
సిరి ప్రకారం టాప్-6: షణ్ముఖ్, సిరి, సన్నీ, శ్రీరామ్, మానస్/కాజల్
చివరిగా ఎవరు ఏ స్థానంలో ఉన్నారంటే: సన్నీ(sunny), షణ్ముఖ్(Shanmukh ), కాజల్(kajal), శ్రీరామ్(sriram), మానస్(manas), సిరి(siri) నా ఫ్యామిలీ తప్ప ఎవరూ నన్ను టాప్-5లో పెట్టలేదు అందుకనే టాప్-6లో నిలబడ్డానని సిరి చెప్పుకొచ్చింది. అంతకు ముందు కాజల్ మూడుసార్లు తనని నామినేట్ చేసిందని అందుకే తాను ఆరో స్థానంలో నిలబడతానని షణ్ముఖ్ అన్నాడు. దీంతో కాజల్ అసహనం వ్యక్తం చేసింది. టికెట్ టు ఫినాలే గెలుచుకున్న శ్రీరామ్ మినహా సన్నీ, షణ్ముఖ్, మానస్, సిరి, కాజల్‌లు నేరుగా ఈ వారం నామినేషన్స్‌లో ఉంటారని బిగ్‌బాస్ స్పష్టం చేశాడు. తనకి, సన్నీకి మధ్య ఏదో క్రియేట్ చేయడానికి మానస్, కాజల్ ప్రయత్నిస్తున్నారని సిరి చెప్పుకొచ్చింది. అయితే సన్నీకి ఆ ఉద్దేశం లేదని అన్నది. తనని లేబుల్ చేయడానికి షణ్ను ప్రయత్నిస్తున్నాడని అందుకే ఆరో స్థానంలో నిలబడతానని అన్నాడని సన్నీ వద్ద కాజల్ వాపోయింది. ఇదే విషయమై కాజల్, షణ్ను ఇద్దరూ మాట్లాడుకున్నారు. కాజల్‌కు ఓవర్ కాన్ఫిడెంట్ బాగా పెరిగిపోయిందని సిరి, షణ్ముఖ్ అనుకున్నారు.