
Bigg Boss Telugu 5: బిగ్‌బాస్ వేదికపై సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్.. షణ్ను గర్ల్‌ఫ్రెండ్ దీప్తి సునయన
హైదరాబాద్: బిగ్‌బాస్(Bigg boss telugu 5) హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్‌ల కుటుంబ సభ్యులు వచ్చి ఈ వారం సందడి చేసిన సంగతి తెలిసిందే. శనివారం నాగార్జున వేదికపైకి వచ్చి తన షో స్టార్ట్ చేశారు. హౌస్‌మేట్స్‌కు సంబంధించిన మరికొందరు కుటుంబ సభ్యులు, స్నేహితులను వేదికపైకి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా రవి తల్లి వేదికపైకి రావడంతో అతడు కన్నీటి పర్యంతమయ్యాడు. ‘కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు బిగ్‌బాస్ రాజా’ అని ఆమె అన్నారు. సాయిలేఖను తీసుకొచ్చానని జబర్దస్త్ అప్పారావు చెప్పగా, ‘లోపలికి పంపండి’ అని శ్రీరామ్ అనడం ‘ఆగలేకపోతున్నావా’ అని అప్పారావు కౌంటర్ ఇవ్వడంతో నవ్వులు పూశాయి. స్నేహితుడితో కలిసి నిఖిల్ బిగ్‌బాస్ వేదికపై నవ్వులు పంచారు. సీజన్-1 విజేత శివ బాలాజీ కూడా హౌస్‌లోకి రావడంతో మరింత సందడి నెలకొంది. ‘ఇప్పుడు తెలిసిందా బిగ్‌బాస్ అంటే ఏంటో’ అని శివ బాలాజీ హౌస్‌మేట్స్‌ను ప్రశ్నించారు. చివరిగా సిరి బాయ్‌ఫ్రెండ్ శ్రీహాన్ వేదికపైకి రాగా, ఆమె భావోద్వేగంతో ఏడుస్తూ ఉండిపోయింది. ‘సిరి వదిలేస్తున్నావా’ అని శ్రీహాన్ అనడంతో సిరి కన్నీళ్లు ఆగలేదు.
► Read latest Cinema News and Telugu News