Bigg Boss Telugu 5: హౌస్‌లో బిగ్‌బాస్‌ తర్వాత వినపడే వాయిస్‌ కాజల్‌దే:నాగార్జున

బిగ్‌బాస్‌ సీజన్‌-5లో ‘టికెట్‌ టు ఫినాలే’ టాస్క్‌లతో ఈ వారమంతా రసవత్తరంగా సాగింది. శనివారం నాగార్జున వచ్చి

Published : 04 Dec 2021 20:13 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-5లో ‘టికెట్‌ టు ఫినాలే’ టాస్క్‌లతో ఈ వారమంతా రసవత్తరంగా సాగింది. శనివారం నాగార్జున వచ్చి హౌస్‌మేట్స్‌తో మాట్లాడారు. వస్తూనే కంప్లెయింట్‌ బాక్స్‌ తీసుకొచ్చారు. హౌస్‌లో ఎవరి మీద ఎవరికి ఫిర్యాదులున్నాయో అందులో వేయమన్నారు. షణ్ముఖ్‌పై సిరి ఫిర్యాదు చేసింది. ‘నేనేం చేశాను సర్‌’ అని షణ్ను అంటే, వెంటనే నాగార్జున అందుకుని ‘తన కోసం సరిగ్గా ఆడకుండా, శ్రీరామ్‌ కోసం ఆడావు కదా’ అని ఆటపట్టించారు. ఆ తర్వాత సన్నీపై కాజల్‌ ఫిర్యాదు చేయగా, సన్నీ సారీ చెప్పాడు. అదే సమయంలో సన్నీపై కాజల్‌ టిష్యూ విసిరేసిన సంఘటనను నాగార్జున గుర్తు చేస్తూ, ఆ విషయాన్ని మర్చిపోవాలని సూచించారు. ఈ సందర్భంగా కాజల్‌ ఇచ్చిన ఎక్స్‌ప్రెషన్‌ను నాగార్జున అనుకరించడంతో అందరూ నవ్వేశారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని