Bigg Boss Telugu 5: ఆరుగురికి ఆరు నిమిషాల సమయం.. ఎవరు ఏ ర్యాంకులో నిలబడ్డారంటే?

బిగ్‌బాస్‌ తెలుగు 5(Bigg boss telugu 5) తుది అంకానికి చేరుతోంది. ఈ క్రమంలో శనివారం వ్యాఖ్యాత నాగార్జున హౌస్‌మేట్స్‌తో

Published : 11 Dec 2021 18:32 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ తెలుగు 5(Bigg boss telugu 5) తుది అంకానికి చేరుతోంది. ఈ క్రమంలో శనివారం వ్యాఖ్యాత నాగార్జున హౌస్‌మేట్స్‌తో కలిసి సందడి చేశారు. చిన్న చిన్న టాస్క్‌లు ఇచ్చారు. ‘వీల్‌ ఆఫ్‌ ది వీక్స్‌’ పేరుతో ఓ గేమ్‌ నిర్వహించారు. వెనక్కి వెళ్లాల్సిన అవకాశం వస్తే ఎవరు ఏం చేసేవారు? దేన్ని చేయకుండా ఉండేవారు? అన్న ప్రశ్నలను అడిగారు. ఏ విషయంలో ఇప్పటికీ బాధపడుతున్నారని కన్ఫెషన్‌ రూమ్‌కు పిలిచి అడిగారు. 11వ వారంలో తాను చేసిన దానికి బాధపడుతున్నట్లు షణ్ముఖ్‌ చెప్పాడు. అదే విధంగా వెనక్కి వెళ్లే అవకాశం వస్తే తాను అలా చేసుకోనని సిరి చెప్పుకొచ్చింది. ఇక హౌస్‌లో హిట్‌ స్టార్‌ ఎవరు? ఫ్లాప్‌ స్టార్‌ ఎవరు? అని అడగ్గా, శ్రీరామ్‌ ఫ్లాప్‌ స్టార్‌ అని కాజల్‌ ట్యాగ్‌ ఇచ్చింది. ‘స్వీట్‌/కన్నింగ్‌ రెండూ కాజల్‌లో ఉంటాయి’ శ్రీరామ్‌ ఆమెకు ఫ్లాప్‌ స్టార్‌ ఇచ్చాడు. ఇక సిరి ఫ్లాప్‌స్టార్‌ అంటూ సన్నీ ట్యాగ్‌ ఇచ్చాడు. ‘సన్నీలో నెగెటివిటీ ఇంకా తగ్గలేదు’ అంటూ సిరి అతడికి ఫ్లాప్‌ స్టార్‌ ఇచ్చింది. ఇక టాప్‌-5లో చేరే ఫైనలిస్ట్‌లు ఎవరో ఈ వీకెండ్‌లో తెలిసిపోతుంది. శనివారం ఒకరిద్దరు పేర్లు వెల్లడించనున్నారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని