Bigg Boss Telugu 5: దుస్తులిప్పి నిలబడమన్నా నిలబడతా.. ఛీ మరీ దారుణం..

బిగ్‌బాస్‌ హౌస్‌లో ఈ వారం కొత్త కెప్టెన్సీ టాస్క్‌ ఆసక్తికరంగా సాగనుంది. ‘సూపర్‌ హీరోస్‌ vs సూపర్‌ విలన్స్‌’గా

Updated : 03 Nov 2021 17:08 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ హౌస్‌లో ఈ వారం కొత్త కెప్టెన్సీ టాస్క్‌ ఆసక్తికరంగా సాగనుంది. ‘సూపర్‌ హీరోస్‌ vs సూపర్‌ విలన్స్‌’గా విడిపోయిన ఇంటి సభ్యులు ఎవరిని ఎవరు టార్గెట్‌ చేశారన్నది ఆసక్తికరం. టాస్క్‌ కోసం దుస్తులిప్పి నిలబడమన్నా నిలబడతా అని రవి చెప్పటం గమనార్హం. ‘ఈ సీజన్‌ అంతా నన్ను అన్నయ్య అని పిలవమని నీకు చెబుతారేమో’అని ప్రియాంకతో మానస్‌ అంటే ‘ఛీ మరీ దారుణం’ అంటూ ఆమె సిగ్గు పడింది. ఈ సందర్భంగా రవికి కొన్ని ప్రత్యేక టాస్క్‌లు ఇచ్చారు. ‘నీకు బ్యాక్‌ పెయిన్‌ ప్రాబ్లమ్‌ ఉంది. జాగ్రత్త’ అని కాజల్‌ అనగా, ‘ప్రాబ్లమ్‌ బ్యాక్‌లో లేదు.. నా ఫ్రంట్‌ ఉంది’ అని ఆమెనే ఉద్దేశించి రవి అనడంతో కాజల్‌ చిన్నబోయింది. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచి కెప్టెన్‌ అయ్యారో తెలియాలంటే వేచి చూడాల్సిందే!



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని