Bigg Boss Telugu 5: హౌస్‌లో వాళ్లిద్దరూ ప్రేమించుకుంటున్నారు.. బాధపడుతున్న సిరి..

ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌ ‘సూపర్‌ విలన్స్‌ vs సూపర్‌ హీరోస్‌’ రసవత్తరంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఒకరిని

Updated : 05 Nov 2021 17:36 IST

హైదరాబాద్‌: ఈ వారం కెప్టెన్సీ టాస్క్‌ ‘సూపర్‌ విలన్స్‌ vs సూపర్‌ హీరోస్‌’ రసవత్తరంగా సాగుతోంది. దీపావళి సందర్భంగా బిగ్‌బాస్‌ హౌస్‌లో సంబరాలు జరిగాయి. హౌస్‌మేట్స్‌ టపాసులు కాల్చారు. స్వీట్స్‌ పంచుకున్నారు. ఈ సందర్భంగా హౌస్‌మేట్స్‌కు ఆసక్తికర టాస్క్‌లు ఇచ్చాడు బిగ్‌బాస్‌. మానస్‌-ప్రియాంక మాట్లాడుకుంటుంటే ‘మచ్చా అక్కడ ఏం జరుగుతోంది’ అని కాజల్‌ను సన్నీ అడిగాడు. ‘ప్రేమించుకుంటున్నారు’ అని కాజల్‌ సమాధానం ఇచ్చింది. ఇక ‘లోపల ఒకటి పెట్టుకుంటావు.. బయటకు ఒకలా ఉంటావు’ అంటూ షణ్ముఖ్‌ను ఉద్దేశించిన సిరి కన్నీటి పర్యంతమైంది. కెప్టెన్సీ టాస్క్‌లో భాగంగా ఒకరిని ఒకరు ఎదుర్కొనే టాస్క్‌ ఇచ్చాడు బిగ్‌బాస్‌. ఇక మెరుపు శక్తికోసం ఇరు జట్లు పోటీ పడ్డాయి. ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారు? ఏ జట్టులోని సభ్యులు కెప్టెన్సీ కోసం పోటీపడ్డారు? తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే. ఇక గురువారం జరిగిన ఎపిసోడ్‌లో ప్రియాంక, అనీ మాస్టర్‌లు తమ జట్టును గెలిపించేందుకు కృషి చేసి విజయం సాధించారు. షణ్ముఖ్‌-సిరిల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని