
Bigg boss telugu 5: మానస్‌ను వదలని పింకీ.. టికెట్ టు ఫినాలే షురూ!
ఇంటర్నెట్‌డెస్క్: నామినేషన్స్ విషయమై ఇంటి సభ్యుల మధ్య వాదన జరిగింది. ఫ్రెండ్ ఎవరో తెలుసుకుని నామినేషన్ చేయాల్సిందని ప్రియాంకతో మానస్ అన్నాడు. చిన్న కారణం చెప్పి కాజల్‌ను నామినేట్ చేయడం బాగోలేదని చెప్పాడు. ఆ తర్వాత అక్కడి నుంచి లేచి వెళ్లేందుకు మానస్ ప్రయత్నించగా, ‘నన్ను వదిలేసి ఎలా వెళ్తావు. నేను మాట్లాడటం అవ్వలేదు’ అని ప్రియాంక అడిగింది. ‘నేను చెప్పటం పూర్తయింది వెళ్తున్నా’ అని మానస్చెప్పడంతో ‘చాలా బాగా అర్థం చేసుకున్నావు థ్యాంక్స్’ అంటూ మానస్‌కు దండం పెట్టి వెళ్లిపోయింది.
ఆ తర్వాత వాష్ ఏరియాలో మానస్, కాజల్, సన్నీ మాట్లాడుకుంటుండగా ప్రియాంక వచ్చి మరోసారి మానస్‌తో వాగ్వాదానికి దిగింది. ‘నీ ఫీలింగ్స్ మాత్రమే గౌరవించి మాట్లాడాలంటే కుదరదు’ అని మానస్ గట్టిగా అరిచాడు. ‘ఎందుకు గట్టిగా అరుస్తున్నావు’ అని ప్రియాంక అనగా ‘నా గొంతు నా ఇష్టం’ అంటూ సమాధానం ఇచ్చాడు. ‘నా నుంచి ఏ ఆశిస్తున్నావు’ అనగా ‘నేనెప్పుడూ ఎవరి నుంచి ఏమీ ఆశించలేదు’ అంటూ ప్రియాంక ఏడుపు మొదలు పెట్టింది. ఒంటరిగా కూర్చొన్న ప్రియాంకను సిరి వచ్చి ఓదార్చింది. ఇదే విషయమై మళ్లీ కిచెన్‌లో మానస్, ప్రియాంకల మధ్య వాగ్వాదం జరిగింది. మధ్యలో కాజల్ వచ్చి ప్రియాంకకు హితబోధ చేసే ప్రయత్నం చేయగా, ఆ గొడవ కాస్త ఇటు మళ్లింది. ‘కాజల్ బయటకు వెళ్లిపోతేనే గొడవలు తగ్గుతాయేమో’ అంటూ ప్రియాంక అరిచేసింది. ఆ తర్వాత ఉదయం లేవగానే కాజల్‌కు సారీ చెప్పింది.
ప్రియాంకకు షణ్ముఖ్‌కు హితబోధ
ఇటీవల హౌస్‌లో కుటుంబ సభ్యులు వస్తే ‘హమ్మయ్య మా వాళ్లు అందరూ వచ్చేశారు’ అని కాజల్ అన్నట్లు షణ్ముఖ్ చెప్పాడు. ‘మా వాళ్లు అంటే’ అని ప్రియాంక అడగ్గా, సన్నీ, మానస్, కాజల్ కుటుంబ సభ్యులు వచ్చి వెళ్లిన తర్వాత అలా అన్నదని, కనీసం ప్రియాంక పేరు కూడా చెప్పలేదని షణ్ముఖ్ చెప్పుకొచ్చాడు. ఈ వారం సన్నీ నామినేషన్స్‌లో లేకపోవడం వల్ల అతని ఫ్యాన్స్ కాజల్‌కు ఓటేస్తారని, అందుకే సన్నీతో ఉంటోందని షణ్ను అన్నాడు. ‘ఇలా కూడా ఆలోచిస్తారా’ అని ప్రియాంక ఆశ్చర్యపోయింది.
టికెట్ ఫినాలే మొదలైంది!
ఇంటి చివరి కెప్టెన్ అయిన షణ్ముఖ్ గడువు మంగళవారంతో ముగిసింది. ఇప్పటివరకూ కెప్టెన్ అవ్వని ప్రియాంక, కాజల్‌లు కెప్టెన్ బ్యాండు పెట్టుకుని ఆనందం పడ్డారు. ఇక టికెట్ టు ఫినాలేలో భాగంగా ఇంటి సభ్యులందరూ మూడు ఛాలెంజ్‌లలో ఒకదాన్ని ఎంచుకోవాలని బిగ్‌బాస్ సూచించగా, ఏకాభిప్రాయంతో ఎండ్యూరెన్స్‌ను ఎంచుకున్నారు. దీంతో హౌస్మేట్స్ ఐస్ టబ్‌లో కాళ్లు పెట్టుకుని ఉండాలని, కాళ్లు బయట పెట్టినప్పుడు ఇతర ఇంటిసభ్యులు అతని దగ్గర ఉన్న బాల్స్‌లో ఒకదాన్ని తీసుకుని తమ టబ్‌లో వేసుకోవాలని సూచించాడు. ఐస్‌లో కాళ్లుపెట్టుకుని నిలబడటానికి చాలా ఇబ్బంది పడ్డారు. ఈ టాస్క్ తొలుత సరదా సాగింది. ఇక రెండో లెవల్లో భాగంగా సన్నీ, షణ్మఖ్లు తమ స్థానాలను మార్చుకున్నారు. మరి టాస్క్‌లో ఎవరు గెలిచారు? టికెట్ ఫినాలే ఎవరు గెలుచుకున్నారు?