Updated : 30/11/2021 13:12 IST

Bigg Boss Telugu 5: బిగ్‌బాస్‌ బంపర్‌ ఆఫర్‌.. టికెట్‌ టు ఫినాలే రేస్ మొదలు!

హైదరాబాద్‌: అక్కినేని నాగార్జున వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ప్రముఖ సెలబ్రిటీ రియాల్టీ షో.. ‘బిగ్‌బాస్‌ సీజన్‌-5’ రసవత్తరంగా సాగుతోంది. టాప్‌ 7 కంటెస్టెంట్స్‌ ఫైనలిస్ట్‌గా తామే ఉండాలని గట్టి పోటీనిస్తున్నారు. ఈ క్రమంలో కంటెస్టెంట్లకు బిగ్‌బాస్‌ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించారు. ఏడుగురిలో ఒకరు నేరుగా ఫినాలే చేరుకునేందుకు ‘టికెట్‌ టు ఫినాలే’ టాస్క్‌ ఇస్తున్నట్లు వెల్లడించారు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లకు మూడు ఛాలెంజ్‌లు ఇచ్చారు. వాటిలో ఎవరు ఎక్కువ పాయింట్లు గెలుచుకుంటారో వారు.. తొలి ఫైనలిస్ట్‌గా నిలుస్తారు. బిగ్‌ బాస్‌ ఇచ్చిన ఎండ్యూరెన్స్‌ ఛాలెంజ్‌లో భాగంగా పోటీదారులంతా  ఐస్‌తో నింపిన టబ్‌లో నిలబడి.. వారికి ఇచ్చిన బాల్స్‌ను కాపాడుకోవాల్సి ఉంటుంది. మరి ఈ టాస్క్‌లో ఎవరు గెలిచారు? మరో రెండు ఛాలెంజ్‌లు ఏంటి? ‘ఫినాలే’ టికెట్‌ ఎవరు గెలుచుకున్నారో తెలియాల్సి ఉంది.

Read latest Cinema News and Telugu News


Read latest Movies News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని