Bigg Boss 5: హౌస్‌లో హీరో ఎవరు? విలన్‌ ఎవరు? కమెడియన్‌ ఎవరు?

ఈ శనివారం బిగ్‌బాస్‌ హౌస్‌ మరింత సందడిగా మారింది. ‘సూపర్‌ హీరోస్‌ vs సూపర్‌ విలన్స్‌’ సందర్భంగా ఇచ్చిన టాస్క్‌ను

Updated : 06 Nov 2021 18:36 IST

హైదరాబాద్‌: ఈ శనివారం బిగ్‌బాస్‌ హౌస్‌ మరింత సందడిగా మారింది. ‘సూపర్‌ హీరోస్‌ vs సూపర్‌ విలన్స్‌’ సందర్భంగా ఇచ్చిన టాస్క్‌ను నాగార్జున మళ్లీ హౌస్‌మేట్స్‌కు ఇచ్చారు. అప్పుడు టాస్క్‌లో పాల్గొని, వివిధ రకాల పదార్థాలు, పానీయాలు కలిపిన డ్రింక్‌ను తాగిన హౌస్‌మేట్స్‌కు రివెంజ్‌ తీర్చుకునే అవకాశం ఇచ్చారు. దీంతో రవి.. షణ్ముఖ్‌ను ఎంచుకున్నాడు. ‘ప్రజలారా ఈ అన్యాయం చూడండి’ అని షణ్ముఖ అనగా, ‘అప్పుడు మీరు చేసిన దానికి ఇది’ అంటూ రవి పంచ్‌లు వేశాడు. ఇక శ్రీరామ్‌.. సన్నీని ఎంపిక చేసుకుని, అతనికి ఇష్టమొచ్చిన రీతిలో పదార్థాలు కలిపి తాగమని చెప్పాడు. ‘ఉల్లిపాయ తిని ఇది తాగు వెళ్లిపోతుంది’ అని శ్రీరామ్‌ అనగా, ‘ఏదో జన్మలో నాకు భర్తవి అయి ఉంటావు. దయచేసి ఆపరా’ అని సన్నీ బతిమలాడుకున్నాడు. ‘వాంతి చేసుకున్నా అవుట్‌ అయినట్టే’ అని నాగార్జున చెప్పడంతో తాగిన దానిని మింగలేక, కక్కలేక సన్నీ పలికించిన హావభావాలు నవ్వులు పూయిస్తున్నాయి. 



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని