Bigg Boss Telugu 6: ‘బిగ్‌బాస్‌’ మళ్లీ వస్తున్నాడు.. ప్రోమోతో సందడి చేస్తున్నాడు!

బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన కార్యక్రమం ‘బిగ్‌బాస్‌’. ఈ షో 6వ సీజన్‌ త్వరలోనే ప్రసారంకానుంది.

Published : 09 Aug 2022 10:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బుల్లితెర ప్రేక్షకుల్ని విశేషంగా అలరించిన కార్యక్రమాల్లో ‘బిగ్‌బాస్‌’ (Bigg Boss) ఒకటి. ఈ షో 6వ సీజన్‌ (Bigg Boss Telugu 6 ) త్వరలోనే ప్రసారం కానుంది. ఇదే విషయాన్ని తెలియజేస్తూ సోషల్‌ మీడియా వేదికగా ప్రోమోను విడుదల చేశారు నటుడు నాగార్జున (Nagarjuna). పెళ్లి అప్పగింతల సమయంలో నవ వధువు కంటతడి పెట్టుకోవటం.. ఆమెను ఓదారుస్తూ.. షో టైమ్‌ అయ్యిందంటూ తల్లీదండ్రులు అదృశ్యమవటం.. వారు ఏమయ్యారో అని పెళ్లికూతురు అన్వేషించే క్రమంలో నాగార్జున ఎంట్రీ ఇవ్వటం.. అప్పగింతలు అయ్యే వరకు కూడా ఆగలేకపోయారంటే అక్కడ ఆట మొదలైనట్టే అని బాగ్‌బాస్‌ని ఉద్దేశించి ఆయన సమాధానం ఇవ్వటం.. తదితర సన్నివేశాలతో ప్రోమో ఆసక్తిగా సాగింది. ‘లైఫ్‌లో ఏదైనా బిగ్‌బాస్‌ తర్వాతే. బిగ్‌బాస్‌ సీజన్‌ 6.. ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డా ఫిక్స్‌’ అంటూ నాగార్జున తనదైన శైలిలో చెప్పి ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమం ఓటీటీ ‘డిస్నీ+ హాట్‌స్టార్‌’లోనూ (Disney+ Hotstar) స్ట్రీమింగ్‌ కానుంది.

గత మూడు సీజన్ల (3,4,5)కు హోస్ట్‌గా వ్యవహరించిన నాగార్జున ఈ కొత్త సీజన్‌లోనూ వినోదం పంచనున్నారు. టీవీలో ప్రసారమైన ఈ కార్యక్రమంతోపాటు ‘ఓటీటీ బిగ్‌బాస్‌’కీ ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ సీజన్‌లో ఎవరెవరు పాల్గొన్నారో త్వరలోనే తెలియనుంది.


Read latest Movies News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram & Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని