Bigg Boss Telugu 7: రచ్చ రచ్చ జరిగే నామినేషన్స్‌ను మరీ ఇంత ఫన్నీ చేసేశారు!

Bigg Boss Telugu 7: బిగ్‌బాస్‌ హౌస్‌లో మూడో వారానికి సంబంధించి నామినేషన్స్‌ ప్రక్రియ షురూ అయింది.

Published : 18 Sep 2023 16:07 IST

హైదరాబాద్‌: సాధారణంగా బిగ్‌బాస్‌ హౌస్‌లో నామినేషన్స్‌ అంటే ఇంటి సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం ఉండటం సహజం. ఒకరు చేసిన తప్పుల్ని మరొకరు ఎత్తి చూపిస్తూ, వ్యక్తిగత విమర్శలకు కూడా దిగుతారు. అలా బిగ్‌బాస్‌ సీజన్‌-7లో భాగంగా మూడో వారానికి సంబంధించిన నామినేషన్స్‌ ప్రక్రియ కూడా వాడీవేడీగా సాగింది. అయితే, పల్లవి ప్రశాంత్‌, టేస్టీ తేజ మధ్య జరిగిన నామినేషన్‌ ప్రక్రియ వినోదాన్ని పంచింది. వాళ్ల మధ్య జరిగిన చర్చ ఇంటి సభ్యులనే కాదు, బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu 7) చూసేవాళ్లను కితకితలు పెట్టడానికి సిద్ధమైంది. ‘బిగ్‌ బాస్‌ ప్రక్రియ నీకు అర్థం కావటం లేదు’ అని టేస్టీ తేజ అనగా, ‘నాకు అర్థంకావటం లేదని నీకెట్లా తెలిసింది’ అంటూ ప్రశాంత్‌ ఎదురు ప్రశ్నించడం, ఆ తర్వాత వారి చేష్టలు చూసి, హౌస్‌మేట్స్‌ నవ్వాపుకోలేకపోయారు. ఇందుకు సంబంధించిన ప్రోమో తాజాగా అలరిస్తోంది.



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని