Bigg Boss Telugu 7: ఈ ఎద్దుపై స్వారీ.. మూడో పవర్‌ అస్త్రను సాధించేది ఎవరు?

Bigg Boss Telugu 7: మూడో పవర్‌ అస్త్ర కోసం ప్రియాంక, శోభ పోటీ పడుతున్నారు? మరి ఎవరు గెలుస్తారో చూడాలి.

Published : 22 Sep 2023 16:58 IST

హైదరాబాద్‌: బిగ్‌బాస్‌ సీజన్‌-7లో భాగంగా మూడో పవర్‌ అస్త్రను సాధించడానికి తన జుట్టును త్యాగం చేసి, పోటీదారుగా నిలిచింది ప్రియాంక జైన్‌. దీంతో ప్రిన్స్‌ యావర్‌, ప్రియాంక, శోభాశెట్టిలు టాప్‌-3లో నిలిచారు. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ వీరికి మరో టాస్క్‌ ఇచ్చాడు. అస్త్రాన్ని పొందడానికి ముగ్గురిలో ఎవరు అనర్హులో తేల్చుకుని, వారి బొమ్మను బద్దలు కొట్టమని చెప్పాడు. దీంతో శోభ, ప్రియాంక జైన్‌లు కలిసి యావర్‌ అనర్హుడని చెప్పడంతో మెజార్టీ ఓటింగ్‌తో యావర్‌ చివరి టాస్క్‌ నుంచి తప్పుకొన్నాడు. తాను టాస్క్‌లో పాల్గొనలేకపోయినందుకు యావర్‌ కన్నీటి పర్యంతమయ్యాడు. శివాజీ అతడిని ఓదార్చే ప్రయత్నం చేసినా, యావర్‌ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. మరోవైపు ఇద్దరు మహిళా కంటెస్టెంట్‌లు మూడో అస్త్ర కోసం సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బిగ్‌బాస్‌ (Bigg Boss Telugu 7) వారికి యంత్రపు ఎద్దుపై స్వారీ చేసే టాస్క్‌ ఇచ్చాడు. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఎక్కువసేపు ఎద్దుపై స్వారీ చేశారు? మూడో పవర్‌ అస్త్రను సాధించారు? తెలియాలంటే ఈ రోజు ఎపిసోడ్‌ చూడాల్సిందే!



Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని