Bigg Boss Telugu5: రెండో వారం ‘బిగ్‌బాస్‌5’లో నామినేట్‌ అయ్యేదెవరు?

Bigg Boss Telugu5:రెండో వారానికి సంబంధించి నామినేషన్‌ ప్రక్రియ ఈ రోజు జరిగింది.

Updated : 13 Sep 2021 19:51 IST

హైదరాబాద్‌: నాగార్జున వ్యాఖ్యాతగా ప్రసారమవుతున్న తెలుగు రియాల్టీ షో ‘బిగ్‌బాస్‌ సీజన్‌5’. మొదటివారం జరిగిన ఎలిమినేషన్‌లో యూట్యూబ్‌ స్టార్‌ ‘సరయు’ ఇంటి నుంచి వెళ్లిపోయారు. కాగా, రెండో వారానికి సంబంధించి నామినేషన్‌ ప్రక్రియ ఈ రోజు జరిగింది. ప్రస్తుతం ఇంటిలో 18మంది సభ్యులు ఉండగా, రెండు టీమ్‌లుగా విడిపోవాలని బిగ్‌బాస్‌ ఆదేశించారు.

ఎల్లో షర్టులు ధరించి మానస్‌, సన్నీ విజయ్‌, కాజల్‌, శ్వేత వర్మ, లహరి, రవి, నటరాజ్‌ మాస్టర్‌, జస్వంత్‌, ఉమాదేవిలు ఉండగా, ఊదా రంగు టీ షర్ట్‌లతో లోబో, శ్రీరామ చంద్ర, సిరి, ప్రియాంక, ప్రియ, యానీ మాస్టర్‌, హమీదా, విశ్వ, షణ్ముకలు ఉన్నారు. లోబో, హమీదాలపై శ్వేత వర్మ తీవ్రంగానే ఫైర్‌ అయింది. ‘దోస్తానా వద్దు రవి’ అంటూ లోబో చేతులు జోడించి చెప్పడం, ‘నీ ఫ్రెండ్‌షిప్‌ నాకొద్దు లోబో’ అని శ్వేత వర్మ అనడం చూస్తుంటే, ఈ వారం నామినేషన్‌ ప్రక్రియలో రెండు గ్రూపుల మధ్య వాదోపవాదాలు గట్టిగానే జరిగినట్టు అర్థమవుతోంది. మరి రెండో వారంలో ఎవరిని ఎవరు నామినేట్‌ చేశారు? ఎంతమంది నామినేషన్‌లలో ఉంటారు? చివరకు ఎవరు ఎలిమినేట్‌ అవుతారు? తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. అప్పటివరకూ వాడీ, వేడితో సాగిన నామినేషన్‌ ప్రక్రియ ప్రోమో వీడియోలను చూసేయండి.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని