Bimbisara: యూట్యూబ్‌ను షేక్‌ చేస్తున్న ‘బింబిసార’ ట్రైలర్!

'ఒక యుద్ధం మీదపడితే ఎలా ఉంటుందో చూస్తారు' అంటూ విడుదలైన 'బింబిసార' ట్రైలర్‌ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ ట్రైలర్‌కు తెలుగు సినీ అభిమానుల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది. ప్రేక్షకులకు...

Published : 07 Jul 2022 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘ఒక యుద్ధం మీదపడితే ఎలా ఉంటుందో చూస్తారు’ అంటూ విడుదలైన ‘బింబిసార’ (Bimbisara Trailer) ట్రైలర్‌ యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తోంది. ఈ ట్రైలర్‌కు తెలుగు సినీ అభిమానుల నుంచి విపరీతమైన స్పందన లభిస్తోంది. ప్రేక్షకులకు ఉత్కంఠ కలిగించే సబ్జెక్టుతో, రెండు విభిన్నమైన పాత్రల్లో నటించిన కల్యాణ్‌ రామ్‌ పవర్‌ఫుల్‌ డైలాగులు ప్రేక్షకులను అలరిస్తున్నాయి. రెండు రోజుల క్రితం(జులై4) విడుదలైన ఈ ట్రైలర్‌ 15 మిలియన్‌ వ్యూస్‌తో ట్రెండింగ్ తెలుగు సినిమా ట్రైలర్‌గా నంబర్‌వన్‌ స్థానంలో ఉంది. ఇటీవల విడుదలైన ట్రైలర్లలో రామ్ నటించిన ‘ది వారియర్‌’ అత్యధిక వ్యూస్‌తో దూసుకుపోతుండగా, ఇప్పుడు ‘బింబిసార’ దాన్ని అధిగమించింది. కల్యాణ్‌రామ్‌ (Nandamuri Kalyan Ram) కెరియర్‌లోనే అత్యధిక వ్యూస్‌, అత్యధిక లైకులు సాధించిన ట్రైలర్‌గా ‘బింబిసార’ నిలిచింది. కేథరిన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలుగా నటించిన ఈ యాక్షన్‌ ఫాంటసీ చిత్రం ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మల్లిడి వసిష్ఠ్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని