Bimbisara: ‘బింబిసార’ కోసం ఇంత కష్టపడ్డారా.. పోరాట దృశ్యాలు ఎలా షూట్‌ చేశారంటే!

బింబిసార మేకింగ్‌ వీడియో. నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన ఈ సినిమా ఇటీవల విడుదలై మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

Published : 16 Aug 2022 11:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇటీవల విడుదలై టాలీవుడ్‌లో నూతనోత్తేజాన్ని తీసుకొచ్చిన చిత్రాల్లో ‘బింబిసార’ (Bimbisara) ఒకటి. నందమూరి కల్యాణ్‌రామ్‌ (Nandamuri KalyanRam) హీరోగా తెరకెక్కిన ఈ సినిమా ప్రశంసలతోపాటు బాక్సాఫీసు వద్ద మంచి వసూళ్లను సాధిస్తోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘ది క్రానికల్స్‌’ పేరిట మేకింగ్‌ వీడియోను విడుదల చేసింది. సోషియో ఫాంటసీ కథలను తెరకెక్కించటం ఎంత కష్టమో ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. సినిమా సెట్స్‌లో వాతావరణం ఎలా ఉంటుంది?ఈ చిత్రంలోని పోరాట దృశ్యాల్ని ఎలా షూట్‌ చేశారు? కథానాయకుడు పరిగెత్తే సీన్‌ని ఎలా క్యాప్చర్‌ చేశారు? తదితర విశేషాల్ని ఈ వీడియోలో చూడొచ్చు. ఈ సినిమాతో తొలి ప్రయత్నంలోనే దర్శకుడిగా తనదైన ముద్రవేశారు వశిష్ఠ. ఎం. ఎం. కీరవాణి అందించిన నేపథ్య సంగీతం, చోటా కె. నాయుడి ఛాయాగ్రాహణం ఈ సినిమాకి ప్రధాన బలంగా నిలిచాయి. కేథరిన్‌, సంయుక్తా మేనన్‌ కథానాయికలుగా అలరించారు. కల్యాణ్‌రామ్‌ కెరీర్‌లోనే భారీ బడ్జెట్‌ చిత్రంగా తెరకెక్కిన ఈ ‘బింబిసార’కు సీక్వెల్‌ వచ్చే అవకాశం ఉంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని