Bimbisara: చరిత్రలోకి తీసుకెళ్లేలా ‘బింబిసార’ ట్రైలర్‌.. కల్యాణ్‌రామ్‌ రాజసం చూశారా!

నటుడు నందమూరి కల్యాణ్‌రామ్‌ కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న చిత్రం ‘బింబిసార’. నూతన దర్శకుడు వశిష్ట దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ విడుదల చేసింది.

Updated : 21 Jul 2022 14:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నటుడు నందమూరి కల్యాణ్‌రామ్‌ (Nandamuri Kalyan Ram) కెరీర్‌లో భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న చిత్రం ‘బింబిసార’ (Bimbisara). వశిష్ట దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ సినిమా ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం ట్రైలర్‌ విడుదల చేసింది. త్రిగర్తల సామ్రాజ్యాధినేత బింబిసారుడిగా కల్యాణ్‌రామ్‌ చేసిన యుద్ధ విన్యాసాలు, పవర్‌ఫుల్‌ సంభాషణలు, విజువల్స్‌తో ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆసక్తిగా సాగింది. ప్రేక్షకుల్ని చరిత్రలోకి తీసుకెళ్లేలా చేస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ ఎంతో ఆసక్తి పెంచగా ఈ ట్రైలర్‌ మరిన్ని అంచనాలు పెంచేలా ఉంది. నందమూరి తారక రామారావు ఆర్ట్స్‌ పతాకంపై హరికృష్ణ.కె నిర్మిస్తున్న ఈ ఫాంటసీ యాక్షన్‌ చిత్రంలో కేథరిన్‌, సంయుక్త మేనన్‌ కథానాయికలు. ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని